పఠాన్ తో బాలీవుడ్ కి పూర్వ వైభోగం వచ్చినట్లేనా.. విశ్లేషకులు వింత వాదన

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.దాదాపు నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ కి సరైన సక్సెస్ లేక పోవడంతో పఠాన్ పూర్వ వైభవాన్ని బాలీవుడ్ కి తీసుకొస్తుందని అంతా భావించారు.

 Bollywood Pathan Movie Collections  ,pathan Movie,bollywood  , Pathan Movie Coll-TeluguStop.com

అనుకున్నట్లుగానే పఠాన్ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.

Telugu Bollywood, Pathan, Shahrukh Khan-Movie

చాలా తక్కువ సమయం లోనే భారీగా కలెక్షన్స్ నమోదు చేసిన పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వ వైభవంను తీసుకొచ్చిందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం వివాదాల కారణంగా పఠాన్ సినిమా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.దీపికా పడుకొనే యొక్క కాషాయం బికినీ కారణంగా వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

పఠాన్‌ సినిమా ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.కానీ అదే సినిమాకు అనూహ్యంగా భారీ కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది.

500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని పఠాన్ సొంతం చేసుకున్నా కూడా బాలీవుడ్ లో రాబోయే సినిమాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ విశ్లేషకుల అభిప్రాయం చేస్తున్నారు.బాలీవుడ్ ప్రేక్షకులు మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు అనేది మరోసారి నిరూపితమైంది.

Telugu Bollywood, Pathan, Shahrukh Khan-Movie

సౌత్ సినిమాలని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్‌ ప్రేక్షకులు అలాంటి మాస్ ఎలిమెంట్ తో హిందీలో సినిమా తీస్తే పఠాన్ కి సక్సెస్ ని కట్టబెట్టినట్లుగా ఆ సినిమాలకు కూడా కమర్షియల్‌ సక్సెస్ లను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.మరి ముందు ముందు కూడా బాలీవుడ్ లో పఠాన్ వంటి సినిమా లు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటాయా అనేది చూడాలి.బాలీవుడ్ కు ఈ ఏడాది మినిమంగా అయినా వసూళ్లు నమోదు అవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube