అనారోగ్యంతో మరణించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు.. !

ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్యాల వల్ల ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు మరణిస్తున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం సుమారుగా మరణాల సంఖ్య ఊహించని స్దాయిలో ఉంది.

 Bollywood Star Music Director Ram Lakshman Died Of Illness, Bollywood, Music Dir-TeluguStop.com

ఇకపోతే సంగీత ప్రస్దానంలో మరో స్వరం మూగబోయింది.బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్(78) నాగ్‌పూర్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ లక్ష్మణ్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్.

అయితే తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించడం మొదలు పెట్టారు.

ఆయన మరణించినా అదే పేరుతో పలు చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారట.

ఇకపోతే ఇప్పటి వరకు రామ్ లక్ష్మణ్, హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.అదీగాక మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ వంటి ఆయన బాణీలు సమకూర్చిన చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube