పాన్ ఇండియా అంటూ మన సౌత్ ఇండియన్ హీరోలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వాళ్ల వాళ్ల సినిమాలను హిందీలోకి డబ్ చేసి అక్కడ వాళ్ళకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని రెడీ చేసుకుంటున్నారు.అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్, బిగ్ స్టార్స్ అయినటువంటి అక్కడి హీరోలు మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ చేయలేదు… ఒకవేళ రిలీజ్ చేసినా మన వాళ్ళు ఎంత వరకు ఆ సినిమా చూస్తారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది… ఇవన్నీ పట్టించుకోకుండా బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా వరుసగా వాళ్ల సినిమా విడుదల తేదీని ప్రకటిస్తున్నారు… రీసెంట్ గా ఈ లిస్టులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గారు కూడా వచ్చి చేరారు.2023 జనవరి 25న పఠాన్ రిలీజ్ అన్న గుడ్ న్యూస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు షారుక్ ఖాన్.దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ పఠాన్ అంటూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.
వార్ ఫేం సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది.అంతేకాదు జాన్ అబ్రహం ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
అలాగే ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ అప్పీరియెన్స్ గా సల్మాన్ ఖాన్ రాబోతున్నారు అనే వార్త ప్రేక్షకులకు పిచ్చేక్కే న్యూస్.ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మామూలుగా ఉండదు అంటూ ఎప్పడినుంచో ఈ సినిమాపై ఫుల్ గా హైప్ క్రియేటవుతున్నా.
కొవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లేటయింది.మధ్యలో ఆర్యన్ ఖాన్ కేసుతో కూడా షూటింగ్ కి దూరమయ్యాడు షారుఖ్.మొత్తానికి ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.
ఇలా ఒక్క షారుక్ ఖాన్ మాత్రమే కాదు వరుసగా బాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరూ కూడా వాళ్ల సినిమాలు రిలీజ్ డేట్స్ ని ప్రకటించేశారు.
ఆ లిస్టు.ఆ సినిమా రిలీజ్ డేట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం.
సూపర్ 30 సినిమా తర్వాత హృతిక్ రోషన్ వార్ అనే సినిమాలో నటించినప్పటికీ అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది… ఆ కసితోనే ఇప్పుడు హృతిక్ రోషన్ విక్రమ్ వేద అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నారు… ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు.సో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విక్రమ్ వేద.ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30 వ తారీకు రిలీజ్ కాబోతుంది.ఇక అదే ఊపులో హృతిక్రోషన్… సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే ప్రకటించేశారు.2023 జనవరి 26న ఫైటర్ సినిమా రిలీజ్ అంటూ డేట్ అయితే ప్రకటించేశారు.కానీ ఎప్పుడైతే షారుక్ ఖాన్ పటాన్ సినిమా జనవరి 25న రిలీజ్ అన్నారో…అప్పుడు రితిక్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక అమీర్ ఖాన్ కూడా లాల్ సింగ చద్దా అనే సినిమా ద్వారా ఏప్రిల్ 14 న మన ముందుకు రావాల్సి ఉంది… కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది అంటూ డేట్ ని మార్చారు.ఈ సినిమాలో మన అక్కినేని నాగచైతన్య ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు.ఒక ఫ్రెంచ్ మూవీ ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ గా వస్తోంది ఈ లాల్ సింగ చద్దా.
అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్, షారుఖ్ ఇద్దరూ అలా తళుక్కున మెరిసి ఫ్యాన్స్ ని ఫిదా చేయబోతున్నారు ఇక ప్రతి సంవత్సరం ఈ కి మన సల్మాన్ ఖాన్ గారి సినిమా ఒకటైతే పక్కాగా వస్తుంది కాబట్టి ఈసారి కూడా గ్రాండ్గా ని ప్లాన్ చేశారు మన సల్మాన్.పూజా హెగ్డే – సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళి 2023 ఈద్ పండక్కి రిలీజ్ కాబోతుంది.
మరి చూద్దాం ఈ సినిమాలో ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో…
.