ఫోటో తీసుకుంటానని వచ్చి ముద్దు పెట్టిన ఫ్యాన్... అవాక్కయిన హీరోయిన్....

మామూలుగా సినీ సెలబ్రిటీలు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు వారితో ఫోటోలు దిగడం అలాగే ఆటోగ్రాఫ్ తీసుకోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి.కానీ బాలీవుడ్ కి చెందినటువంటి ఓ సినీ నటి ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఓ వ్యక్తి ఫొటో తీసుకుని నెపంతో ఏకంగా చేతిపై ముద్దు పెట్టాడు.

 Bollywood Model Arshi Khan Facing Abuse Moments In Airport-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో పలు సీరియళ్లు మరియు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ మోడల్ మరియు నటి “అర్షి ఖాన్” ముంబై ఎయిర్ పోర్టుకి వెళ్ళింది.

 Bollywood Model Arshi Khan Facing Abuse Moments In Airport-ఫోటో తీసుకుంటానని వచ్చి ముద్దు పెట్టిన ఫ్యాన్… అవాక్కయిన హీరోయిన్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెను గుర్తించి ఫోటో తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళాడు.దీంతో ఆ వ్యక్తి ఇదే అదునుగా చేసుకొని ఫోటో తీసుకునే నెపంతో “అర్షి ఖాన్ చేతిని అందుకొని ఏకంగా “ముద్దు” పెట్టాడు.

దాంతో అర్షి ఖాన్ అతడి నుండి చేయిని విడిపించుకుని కోపంతో వెళ్లి పోయింది.ఇదంతా గమనించిన కొందరు స్థానికులు ఈ సంఘటనని తమ చరవాణిలలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ సినీ సెలబ్రిటీలకి కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఉంటాయని కాబట్టి ఇలాంటి పనులతో వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అర్షి ఖాన్ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం.కాగా ఈ అమ్మడు ఆ మధ్య బా హిందీలో బాగా పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు బాగానే తలుపు తడుతున్నాయి.

#BollywoodModel #Arshi Khan #Abuse Moments #ArshiKhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు