వామ్మో ప్రభాస్.. బాలీవుడ్ ను దున్నేయబోతున్నాడా? 

Bollywood Mafia Eye On Hero Prabhas

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజి ఓ రేంజిలో పెరిగిపోయింది.ప్రస్తుతం ప్రభాస్ ఫాన్ ఇండియన్ హీరోగా దూసుకెళ్తున్నాడు.

 Bollywood Mafia Eye On Hero Prabhas-TeluguStop.com

ప్రస్తుతం పలు బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు ఓకే చెప్తున్నాడు.ఈ సినిమాలన్నీ పాన్ ఇండియన్ మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి.

అయితే బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రభాస్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.ధర్మ ప్రొడక్షన్స్ లో భారీగా రెమ్యునరేషన్ ఇవ్వజూపాడు.

 Bollywood Mafia Eye On Hero Prabhas-వామ్మో ప్రభాస్.. బాలీవుడ్ ను దున్నేయబోతున్నాడా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందేకాదు.భారీ బడ్జెట్ సినిమాలను తనతో వరుసబెట్టి తీస్తానని హామీ కూడా ఇచ్చాడు.

కానీ ఎందుకో తెలియదు.ప్రభాస్ ఆయన ఆఫర్ కు నో చెప్పాడు.

అంతేకాదు.పలువురు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు.

తాజాగా తను ఆదిపురుష్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.ఓంరౌత్ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది.

టీ-సిరీస్, రైట్రోఫిలైస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు.

అయితే కరణ్ జోహార్ ను కాదని ప్రభాస్ ఈ సంస్థలతో సినిమా ఎలా చేస్తున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ప్రభాస్ కు అద్భుతంగా నచ్చిందట.

రామాయణం ఆధారంగా ఈకథను రెడీ చేశారట.అటు తాజాగా ప్రభాస్ తో సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నడియావాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్, రాధాక్రిష్ణ కుమార్ తో కలిసి రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో కలిసి ప్రాజెక్ట్ కె, సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.అటు యష్ రాజ్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ధూమ్ -4 సినిమాలో కూడా ప్రభాస్ నే హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట.అయితే ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో హీరోగా చేసేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ లో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రభాస్ వెల్లడించాడు.ఈ సినిమాకు వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

#Prabhas #Prabhas Dhoom #Dhoom #Adipurush #PrabhasEyes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube