అలాంటి హెయిర్ ట్రిక్ చేసిన కత్రినా.. మీరు చెయ్యగలరా?

సాధారణంగా పొడవు జుట్టు ఉన్న అమ్మాయిలు జుట్టు ను మెయింటైన్ చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.మాటిమాటికి ఆ జుట్టును సరి చేసుకోవాలంటే ఇబ్బందిపడుతూ ఎంతోమంది పొడవు జుట్టు కాస్త పొట్టిగా చేసుకుంటూ ఉంటారు.

 Bollywood Actress Katrina Kaif New Hair Trick Viral Video, Katrina Kaif, New Hai-TeluguStop.com

ఈ మధ్య కాలంలో పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిలు కనిపించడం చాలా అరుదు.అయితే పొడవు జుట్టు ఉన్న అమ్మాయిలు వారి జుట్టును ఎలా మేనేజ్ చేసుకోవాలో కత్రినా కైఫ్ సింపుల్ టెక్నిక్ ను ఒక వీడియో రూపంలో తెలియజేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిలు జుట్టు ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.

కానీ దానిని మెయింటెన్ చేయలేక ఎంతో ఇబ్బందిపడుతున్న వారికి కత్రినాకైఫ్ ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.పొడవైన జుట్టును సింపుల్ గా ముడి వేసుకునే ట్రిక్ కత్రినా కైఫ్ ఒక వీడియోను రూపొందించి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు.

కత్రినా కైఫ్ ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ న్యూ చిల్‌ శనివారం రాత్రళ్లు.కొత్త హెయిర్‌ ట్రిక్‌, సాయిరాహ్‌ కబీర్‌ ఈ ట్రిక్‌ను నాకు నేర్పారు అంటూ మెసేజ్‌ కూడా చేశారు.

కత్రినాకైఫ్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో పొడవైన జుట్టు ను కేవలం రెండు మూడు సెకండ్ల వ్యవధిలో ఎలా ముడి వేసుకోవచ్చు అనే ట్రిక్ చూపించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరెందుకాలస్యం ఆ వీడియోని మీరు చూసి ఒకసారి ట్రై చేయండి.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కత్రినా కైఫ్ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.

కరోనా కారణం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ బ్యూటీ బూత్ పోలీస్ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube