బాలీవుడ్ లో మరో విషాదం. ఒకప్పటి హాస్యనటుడు మృతి  

Veteran Bollywood Actor Jagdeep Passes Away, Tollywood, Bollywood, Indian cinema, Celebrities - Telugu Bollywood, Celebrities, Indian Cinema, Tollywood, Veteran Bollywood Actor Jagdeep Passes Away

బాలీవుడ్‌లో వరుస విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఏడాది ఆరంభం నుంచి అన్ని దుర్వార్తలు వినాల్సి వస్తుంది.

 Bollywood Jagdeep

తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.మూడు నెలల వ్యవధిలో ఐదుగురు బాలీవుడ్ ప్రముఖులు మరణించారు.

రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ మరణించారు.తాజా ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు మృతి చెందారు.

బాలీవుడ్ లో మరో విషాదం. ఒకప్పటి హాస్యనటుడు మృతి-Movie-Telugu Tollywood Photo Image

అందులో ఒకరు ప్రముఖ దర్శక నిర్మాత అయిన హరీష్ షా గొంతు క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు జగ్‌దీప్ కూడా వయోభారంతో కన్నుమూసారు.

81 సంవత్సరాల జగదీప్ అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ షోలేలో సూర్మా భూపాలి పాత్రతో సినీ అభిమానులకు సుపరిచితుడు.ఆయన అసలు పేరు సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ.

అందాజ్ అప్నా అప్నా మూవీలో జగ్‌దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది.బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్‌దీప్ దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారు.

వీరి మరణంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.ఒకేసారి ఇద్దరు ప్రముఖులని కోల్పోవడం దురదృష్టం అని అన్నారు.

#Celebrities

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Jagdeep Related Telugu News,Photos/Pics,Images..