మరణించిన తర్వాత ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్న టాలెంటెడ్ నటుడు

బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్.తాను చేసిన ప్రతి సినిమాలో కచ్చితంగా పాత్రల విషయంలో ప్రత్యేకత ఉండే విధంగా చూసుకోవడం ఇర్ఫాన్ ఖాన్ స్టైల్.

 Irrfan Khan Wins Best Actor At Asian Film Awards, Bollywood, Tollywood, Indian C-TeluguStop.com

ఈ కారణంగానే జాతీయ ఉత్తమనటుడుగా కూడా ఇర్ఫాన్ ఖాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.అంత మంచి నటుడు కాబట్టి హాలీవుడ్ దర్శకులు సైతం వెతుక్కుంటూ వచ్చి ఆయనకి అవకాశాలు ఇచ్చారు.

హాలీవుడ్ సినిమాలలో మెయిన్ లీడ్ పాత్రలు చేసిన ఇండియన్ గా అరుదైన ఘనతని ఇర్ఫాన్ ఖాన్ సొంతం చేసుకున్నాడు.అయితే క్యాన్సర్ లో ఆయన చాలా చిన్న వయస్సులోనే సినీలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

చనిపోతానని తెలిసి కూడా ధైర్యంగా ఉంటూ చివరి రోజుల్లో కూడా ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు చేసారంటే ఆయనకి నటన అంటే ఉన్న పాషన్ ఏంటో తెలుస్తుంది.

ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న అరుదైన ఘనత అతనికి సొంతం అయ్యింది.

తాను నటించిన అంగ్రేజీ మీడియంకు గాను ఉత్తమ నటుడిగా ఎన్నిక అయ్యారు.ఆయన కు అవార్డు ప్రకటించిన సమయంలో అభిమానులు, సినీ వర్గాల వారు ఎమోషనల్ అయ్యారు.

ఆయన అవార్డు ను తనయుడు బాబిల్ అందుకున్నారు.అంగ్రేజీ మీడియం సినిమాను కూడా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూనే పూర్తి చేశారు.

ఆరోగ్యం సహకరించకున్న కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.అంగ్రేజీ మీడియంకు దక్కిన విజయాన్ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆయన కు ఫిలిం ఫేర్ అవార్డు రావడం పట్ల మరింతగా ఆనందం వ్యక్తం అవుతోంది.తెలుగులో సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి విలన్ గా నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube