కొద్ది రోజుల ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ నే చూపించేవారు.అక్కడి సినిమాలనే లెక్కలోకి తీసుకునేవారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది.టాలీవుడ్ సైతం బాలీవుడ్ ను తలదన్నేలా తయారవుతోంది.
తెలుగులో విడుదలవుతున్న పాన్ ఇండియన్ రేంజ్ మూవీస్ బాలీవుడ్ ను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి.స్టార్ వ్యాల్యూతో పాటు టాలీవుడ్ నెంబర్ వన్ అనే స్థాయికి చేరుకుంది.
బాలీవుడ్ స్టామినాతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమ దమ్ము పెరిగిపోయింది.సినిమా కథలు, ప్రాజెక్టు స్టైల్, మార్కెటింగ్ స్కిల్స్ అన్నింటిలోనూ టాలీవుడ్ దూకుడు ప్రదర్శిస్తోంది.
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసి వచ్చింది.ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్నీ అదే స్థాయిలో ముందుకు సాగుతున్నాయి.
తాజాగా రిలీజ్ అయిన సినిమా పుష్ప.ఈ సినిమా ఇండియా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో పాటు అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, క్రాక్, శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ సహా పలు సినిమాలు కలిసి 1300 కోట్ల రూపాయల వసూళ్లను చేపట్టాయి.దీంతో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా బాలీవుడ్ కు తెలిసి వచ్చింది.
ప్రస్తుతం తెలుగు సినిమాల మీద ఫోకస్ చేసింది బాలీవుడ్.ఇక్కడి హీరోల కోసం బాలీవుడ్ దర్శకులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు స్టార్స్ తో సినిమాలు చేసేందుకు అక్కడి ప్రోడ్యూసర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
బాలీవుడ్ ఒక్కటే కాదు.సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమలు సైతం తెలుగు స్టార్స్ వైపు చూస్తున్నారు.అటు కన్నడ, తమిళ్, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో సెట్స్ మీద ఉన్న చాలా సినిమాల్లో ఆయా సినిమా పరిశ్రమలకు చెందిన నటీనటులు ఆయా పాత్రలను పోషిస్తున్నారు.త్రిఫుల్ ఆర్ రిలీజ్ అయితే తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ మరో స్థాయికి చేరే అవకాశం ఉంది.