ఒబామాతో ఇండియన్ హాట్ బ్యూటి

ఖ్వాయిష్, మర్డర్ చిత్రాలతో యువతకి ఓ రేంజ్ కిక్కు ఎక్కించింది మల్లిక షెరావత్.అప్పట్లో అందాల ఆరబోత అయినా, అధర చుంబన దృశ్యాలు అయినా, అందరికి గుర్తొచ్చే పేరు మల్లిక.

 Mallika Sherawat Clicked With Barack Obama-TeluguStop.com

ఆ క్రేజ్ ని ఉపయోగించుకోని రానురాను మరింత రెచ్చిపోయిన మల్లిక, కొన్నిరోజులు యువత గుండెల్లో తిష్ఠ వేసింది.ఆ తరువాత అత్యాశకు పోయి, హాలివుడ్ అంటూ తిరిగి ఇక్కడి అవకకాశాల్ని పోగొట్టుకుంది.

ఒకటి రెండు పరదేశ సినిమాలు చేసినా, అవి మల్లికాకి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు.అతిగా ఆలోచించి అటుగాకుండా ఇటుగాకుండా పోయింది ఈ హాట్ బ్యూటి.

మళ్ళి హిందీ సినిమాల్లో ప్రయత్నాలు చేసినా, ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు కదా.అప్పుడంటే శృంగార దృశ్యాల్లో రెచ్చిపోవాలంటే మల్లికా మాత్రమే కనబడేది.మరి ఇప్పుడో, దాదాపు ప్రతి కొత్త కథానాయిక లిప్ లాక్ , రొమాంటిక్ సీన్స్ అంటే అడ్డు చెప్పట్లేదు.అందుకే బాలివుడ్ మల్లికాను మర్చిపోయింది.

అవకాశాలు లేక అమెరికా చెక్కేసింది మల్లిక.అక్కడే ఇంకా ఇంగ్లిష్ సినిమాల కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తోంది.

న్యూస్ చానెళ్ళు, వార్తాపత్రికలు మళ్ళి తన గురించి చెప్పాలని ప్లాన్ వేసినట్టుంది .బాగానే అలోచించి ఇదిగో ఏకంగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను కలిసింది.మల్లిక షెరావత్ సేల్ఫీ అడిగితే ఒబామా అయినా సరే .సరే అనకుండా ఉంటాడా ! ఇదిగోండి అమెరికా అధ్యక్షుడితో ఇండియన్ హాట్ బ్యూటి సెల్ఫి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube