30 ఏండ్ల సినీ కెరీర్ తో ముందుకు సాగుతున్న బాలీవుడ్ హీరోలెవరో తెలుసా.?

బాలీవుడ్ లో చాలా మంది హీరోలు 30 ఏండ్ల కెరీర్ దాటినా.ఇంకా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.

 Bollywood Heros With More Than 30 Years Age In Acting Details, Bollywood Heroes,-TeluguStop.com

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లంతా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.

సినిమా పరిశ్రమలో ముప్పై ఏండ్లు దాటినా.ఇప్పటికీ బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్.30 ఏండ్ల కెరీర్ కంప్లీట్ చేశాడు.స్టంట్ మెన్ కొడుకుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన.తన అద్భుత నటుడితో స్టార్ హీరోగా ఎదిగాడు.బాలీవుడ్ బ్యూటీ కాజోల్ తో కలిసి చాలా సినిమాలు చేశాడు.ఆ తర్వాత ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి పలు సినిమాలు చేశారు.ప్రస్తుతం బాలీవుడ్ లో మైదాన్.

తెలుగులో ట్రిఫుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు అజయ్ దేవగణ్.

ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ సినిమాలు చేస్తున్నాడు అక్షయ్ కుమార్.ఈయన కూడా సినిమాల్లో 30 ఏండ్లు పూర్తి చేస్తున్నాడు.1991లో సౌగంధ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అక్షయ్.బాలీవుడ్ లో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా మారిపోయాడు.

Telugu Bollywood, Akshay Kumar, Ameerkhan, Bollywod Top, Bollywood Heros, Bollyw

ఆయన నటిస్తున్న చాలా సినిమాలు రూ.200 కోట్లతో తెరకెక్కుతున్నాయి.ప్రయోగాత్మక సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

Telugu Bollywood, Akshay Kumar, Ameerkhan, Bollywod Top, Bollywood Heros, Bollyw

అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సైతం ఇండస్ట్రీలో 30 ఏండ్లు పూర్తి చేసుకున్నారు.అమీర్ ఖాన్ 1973 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.దంగంల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించాడు . షారుఖ్, సల్మాన్ ఖాన్ కూడా 30 ఏండ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.

Telugu Bollywood, Akshay Kumar, Ameerkhan, Bollywod Top, Bollywood Heros, Bollyw

షారుఖ్ సీరియల్ యాక్టర్ గా అడుగు పెట్టి.టాప్ హీరోగా ఎదిగాడు.దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.30 ఏండ్ల ఇండస్ట్రీ కెరీర్ లో ఎన్నో తిరుగు లేని సినిమాల్లో నటించాడు.ఎంతో జనాదరణ దక్కించుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube