ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగి ప్రస్తుతం ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోలకు( Bollywood Heros ) అలాగే టైర్ టు హీరోలుగా కొనసాగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న హీరోలకు ఊపు ప్రస్తుతం టాలీవుడ్ ఒక అడ్డాగా మారింది మన తెలుగులో వస్తున్న ప్రతి సినిమాలోనూ ప్రస్తుతం బాలీవుడ్ నటులే విలన్స్ గా నటిస్తుండడం విశేషం మరి విలన్స్ గా మారిన ఆ బాలీవుడ్ హీరోలు ఎవరు కొత్తగా వస్తున్న సినిమాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సైఫ్ అలీ ఖాన్
చాలా మంది ఎదురుచూస్తున్న అలాగే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా లో( Adipurush ) విలన్ గా నటిస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్.( Saif Ali Khan ) హీరోగా ప్రస్తుతం సైఫ్ కి ఎలాంటి పాపులారిటీ లేదు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న కీలకమైన సన్నివేశాల్లో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.అలాంటి టైం లోనే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో చేస్తున్న ఫ్యాన్ ఇండియా సినిమా ఆది పురుష చిత్రంలో విలన్ గా నటించే అవకాశం లభించింది.ఈ సినిమా తర్వాత సైఫ్ హీరోగా లేదా విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం గ్యారెంటీ.
బాబీ డియోల్
పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పాలనలో గజదొంగగా వీరమల్లు అనే పాత్రలో పవన్ నటిస్తుండగా అతడికి దీటైన పాత్రలో ఔరంగాజేబ్ గా బాబి డియోల్ నటిస్తున్నాడు.బాబీ చాలా రోజులుగా ఫేడ్ అవుట్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.
అర్జున్ రాంపాల్
బాలీవుడ్ లో ఓ మోస్తరు నటుడుగా కొనసాగుతున్న అర్జున్ రాంపాల్ బాలకృష్ణ 108వ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ లో ఉంది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీ లీల ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
సంజయ్ దత్
మారుతీ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా రాజా డీలక్స్. ఇది అతి త్వరలో సెట్స్ పైకి వెళ్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.