జూనియర్ ఎన్టీఆర్.రూపంలోనే కాదు.
నటనలోనూ తాత నందమూరి తారక రామారావుకు ఏమాత్రం తీసిపోడు.అచ్చం తాత మారిగానే ఉండే ఈ కుర్రాడు తొలి సినిమా నుంచే జనాలు బాగా ఆకట్టుకున్నాడు.
యమదొంగ సినిమా తర్వాత ఇతడి నటాన తీరు, డ్యాన్సుల్లో గ్రేస్.వారెవ్వా అనిపించాయి.తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్.ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో.ఊహించని మాస్ జనాలు ఆదరణతో మాంచి స్వింగ్ లో కొనసాగుతునాడు.తాజాగా ఆయన చేసిన సినిమాలన్నీ వరుస విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఆయన గత చిత్రం అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆయన తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్.ఆయన మాట్లాడే విధానం, అంతకు మించి ఆలోచించే తీరు అబ్బరు పరిచాయి.
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.తాజాగా విడుదల అయిన మూవీ ట్రైలర్స్ లో ఎన్టీఆర్ నటన అదుర్స్ అనిపించింది.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను చూసిన తర్వాత టాలీవుడ్ లోనే కాదు.బాలీవుడ్ లోనూ ఎంతో మంది హీరోయిన్లు తనపై మనసు పారేసుకుంటున్నారు.ఆయనతో ఒక్కసారి అయిన కలిసి నటించాలి అని కోరుకుంటున్నారు.తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది ఆలియా భట్.ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ తో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
అటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఎన్టీఆర్ నటకు ఫిదా అయ్యింది.తనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుటంటుంది అని వెల్లడించింది.అటు పాయల్ ఘోష్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆరాటపడుతుంది.మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరి మనసులో దోచేస్తున్నాడు ఎన్టీఆర్.
ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయనతో వెండితెరపై వెలిగిపోవాలి అనుకుంటున్నారు.చూద్దాం ఎన్టీఆర్ తో ఏ బాలీవుడ్ హీరోయిన్ తన తర్వాత సినిమా చేస్తుందో?
.