గర్భం వచ్చిన తర్వాతే పెళ్లి.. బాలీవుడ్ హీరోయిన్ల తీరు అస్సలు బాలేదుగా!

మన దేశంలోని ప్రజలు ఆచారాలు, సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడతారు.ఈ కారణం వల్లే ఇతర దేశాల ప్రజలు సైతం మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే.

 Bollywood Heroines Shocking Behavior About Pregnancy Details Here Goes Viral In-TeluguStop.com

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు గర్భం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ఎంతమంది విమర్శలు చేసినా బాలీవుడ్ హీరోయిన్ల తీరులో మార్పు రావడం లేదు.

బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన ఇలియానా తాజాగా ప్రెగ్నెన్సీ( Ileana )ని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్నకు మాత్రం ఇలియానా వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు.ఇలియానా పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఆమె పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు వింటామో చూడాల్సి ఉంది.అలియాభట్ సైతం పెళ్లికి ముందే గర్భవతి అయినా పెళ్లి తర్వాతే ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు./br>

హీరోయిన్ ఎమీ జాక్సన్ సైతం పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చారు.కల్కి కొల్చిన, దియా మీర్జా( Dia Mirza ) కూడా పెళ్లికి ముందే గర్భం ధరించిన వాళ్ల జాబితాలో ఉన్నారు.నేహా ధూపియా( Neha Dhupia ) పెళ్లికి ముందే గర్భం దాల్చి పెళ్లైన 5 నెలలకు బిడ్డకు జన్మనిచ్చారు.స్టార్ హీరోయిన్లు ఈ విధంగా చేస్తూ అభిమానులకు ఇస్తున్న సందేశం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి./br>

ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్లు అయినా ఈ విషయంలో తీరును మార్చుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గర్భం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడంపై ఆయా హీరోయిన్ల అభిమానులు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.సినీ కెరీర్ కోసం కొంతమంది హీరోయిన్లు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంలో ఒక్కో హీరోయిన్ తీరు ఒక్కో విధంగా ఉంది.

టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో బెటర్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube