బాలీవుడ్ భామలు నటించినా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామలు తరచుగా కనిపించి వెళ్తుంటారు.ఆయా సినిమాలకు మంచి హైప్ తెప్పించడానికి దర్శకులు ప్లే చేసే ట్రిక్ ఇది.

 Bollywood Heroines Failed In Tollywood, Tollywood , Bollywood , Tollywood Flop M-TeluguStop.com

బాలీవుడ్ బ్యూటీ అనగానే సినిమాపై అంచనాలు పెరిగి.జనాలు థియేటర్లకు పరుగెడతారు అనేది వీరి నమ్మకం.

అందుకే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆయా పాత్రలను చేయిస్తారు.అయితే అదే నమ్మకం ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ కొడుతుంది.

సినిమాలకు బాలీవుడ్ భామల మూలంగా పేరు రాకపోగా పారితోషికం దండుగ అనే పరిస్థితి నెలకొన్న సందర్భాలున్నాయి.అలాంటి టాక్ తెచ్చుకున్న సినిమాలేంటో బాలీవుడ్ నుంచి వచ్చిన సక్సెస్ కాని బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
పూజా బేడీ – శక్తి

Telugu Bollywood, Bruclee, Isha Koppikar, Ishakoppikar, Kajal, Keshava, Mandira

మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి సినిమా కనీవినీ ఎరుగని రీతిలో డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమాకు పాన్ ఇండియన్ మూవీ లెవల్లో డబ్బులు ఖర్చు చేశారు.కూడా.ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి పూజా బేడీని స్పెషల్ క్యారెక్టర్ కోసం తీసుకొచ్చారు.ఈమె విలన్ తల్లి పాత్ర చేశారు.అయితే పూజా బేడీ పాత్ర జనాలను అస్సలు ఆకట్టుకోలేకపోయింది.

మొత్తంగా ఈ సినిమానే పెద్ద ఫ్లాప్ అయ్యింది.పైగా ఈ క్యారెక్టర్ కోసం పూజా భారీగా రెమ్యునరేషన్ తీసుకుందట.
టిస్కా చోప్రా – బ్రూస్ లీ

Telugu Bollywood, Bruclee, Isha Koppikar, Ishakoppikar, Kajal, Keshava, Mandira

శ్రీను వైట్ల, రాంచరణ్ కాంబోలో బ్రూస్ లీ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ టిస్కా చోప్రాను తుసుకొచ్చాడు.ఈ సినిమాలో విలన్ గర్ల్ ఫ్రెండ్ గా టిస్కా నటించింది.అయితే టిస్కా పాత్ర ఇందులో తేలిపోతుంది.టాలెంట్ నటి క్యారెక్టర్ ఇంత చీప్ గా డిజైన్ చేయడం జనాలకు అస్సలు నచ్చలేదు.టిస్కా ఈ పాత్ర చేయకపోతే బాగుండేది అనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తం అయ్యింది.
రొమాంటిక్ -మందిరా బేడీ

Telugu Bollywood, Bruclee, Isha Koppikar, Ishakoppikar, Kajal, Keshava, Mandira

పూరీ కొడుకు ఆకాష్ మీరోగా రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా కోసం ముందుగా మందిరా బేడీని సెలెక్ట్ చేసుకున్నారు.కొంత షూటింగ్ జరిగాక ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను సినిమా నుంచి తప్పించారు.ఆ స్థానంలో రమ్యకృష్ణని ఓకే చేశారు.ఇంతకీ మందిరాను ఎందుకు వద్దన్నారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.సాహో సినిమాలో మందిరా నటించినా వేస్ట్ అనే భావం కలిగింది.
ఇషా కొప్పికర్ – కేవవ

Telugu Bollywood, Bruclee, Isha Koppikar, Ishakoppikar, Kajal, Keshava, Mandira

నిఖిల్ నటించిన కేశవ సినిమాలో ఇషా ఓ కీరోల్ చేసింది.గతంలోనే ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించింది.అక్కినేని నాగార్జునతో చంద్రలేఖ సినిమా చేసింది.చాలా రోజుల తర్వాత కేశవ మూవీలో నటించింది.ఇందులో పోలీస్ అధికారి పాత్రను పోషించింది.యావరేజ్ గా ఆడిన ఈ సినిమా కోసం ఇషాను ఎంపిక చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
కాజోల్ – విఐపి 2ధనుష్ విఐపి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కీరోల్ చేసింది.ఇందుకోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకుంది.కానీ ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.కాజోల్ క్యారెక్టర్ తనకు గానీ, సినిమాకు గానీ ఏ రకంగా ఉపయోగపడలేదనే విమర్శలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube