బాలీవుడ్ తారలు అలా.. టాలీవుడ్ బ్యూటీలు ఇలా.. పెళ్లిపై ఎవరి తీరు వారిదే

కల్యాణం వచ్చినా.కక్కు వచ్చినా ఆగదంటారు పెద్దలు.

 Bollywood Heroines Craze After Marriage, Bollywood Heroines, Tollywood Heroines,-TeluguStop.com

అలాగే సినిమా హీరోయిన్ల విషయంలోనూ ఇది వాస్తవం అని నిరూపితం అవుతోంది.పెళ్లికి టైముంది అని చెప్తారే తప్ప.

అసలు పెళ్లే చేసుకోం అని ఏ హీరోయిన్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం 50 ఏండ్లు గడిచినా పెళ్లే చేసుకోని వారు ఉన్నారు.

దానికి పలు కారణాలు చెప్తారు సదరు ముదురు భామలు.తాజాగా కొందరు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే పెళ్లి చేసుకోం అని చెప్తున్నారు.

బాలీవుడ్ లో మాత్రం సీన్ మరోలా ఉంది.ఓ వైపు సినిమాలు చేస్తూనే.

మరో వైపు పెళ్లి చేసుకుని.వివాహ జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతున్నారు.

మరికొంత మంది హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు.బాలీవుడ్ టాప్ బ్యూటీ కాజల్ తన కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలు కూడా చేసింది.మన హీరోయిన్లు మాత్రం ఇప్పడే పెళ్లేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Telugu Alia Bhatt, Anushka Sharma, Bollywood, Priyanka Chopra, Sonam Kapoor, Tol

తాజాగా బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే పెళ్లి చేసుకుంది.ఆమె కెరీర్ కూడా ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉంది.పెళ్లి అయినా సినిమాలు కూడా చేస్తూనే ఉంది.అటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోని అడుగు పెట్టిన నల్లకలువ ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి చేసుకుంది.అప్పుడు తను హాలీవుడ్ సినిమాలో మంచి ఊపుమీదుంది.ప్రస్తుతం తను కూడా సినిమాలు చేస్తూనే ఉంది.

అనుష్క శర్మ, సోనమ్ కపూర్, విద్యాబాలన్ సహా పలువురు హీరోయిన్లు మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు.మంచి సినీ కెరీర్ ను కూడా కొనసాగిస్తున్నారు.


అటు తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్, మౌని రాయ్ కూడా ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం వారు కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.

బాలీవుడ్ టాప్ నటీమణి అలియా భట్ కూడా రణబీర్ తో పెళ్లికి రెడీ అవుతోంది.తెలుగు సినిమా హీరోయిన్లు మాత్రం అమ్మో అప్పుడే పెళ్లా అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube