టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “RRR” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో కూడా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆ హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోందని వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.మరి ఆనటి ఎవరు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంటుంది.