విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ హీరోయిన్..హింట్ ఇచ్చిన టాలీవుడ్ భామ!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ప్రస్తుతం అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉంది.తాను నటించిన ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను సొంతం చేసుకున్నాడు.

 Sara Ali Khan To Act In Vijay Devarakonda Liger Movie ,vijay Devarakonda, Tollyw-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు విజయ్.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమా ను ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, చార్మి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

ఇక ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 9 న విడుదల కానున్నట్లు సినీ బృందం తెలిపింది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్.కొన్ని రోజుల నుండి ఈ విషయం గురించి సమాచారాలు వస్తుండగా.ఈసారి సినీ నిర్మాత చార్మి మొత్తానికి ఓ హింట్ ఇచ్చింది.

తాజాగా చార్మి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా.

ఆ ఫోటోకు ఆర్టిస్టులందరినీ ఒక దగ్గరకు చేరిస్తే.ఇలానే ఉంటుంది అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

ఇక ఈ ఫోటోలో డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ , ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, చార్మి ఉండగా.ఇందులో సారా అలీ ఖాన్ కూడా ఉండగా ఆ సినిమాలో నటిస్తుందని అర్థమవుతుంది.ఇందులో సారా పాత్ర గురించి ఎటువంటి ప్రకటనలు అందించకపోగా.త్వరలోనే ఈ విషయం గురించి వెల్లడిస్తారని తెలుస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube