నా అనుభవంతో చెబుతున్నా... పెళ్లైన వాళ్లతో ఎఫైర్ పెట్టుకోవద్దు అంటున్న హీరోయిన్....

బాలీవుడ్లో 1982వ సంవత్సరంలో సాత్ సాత్ అనే చిత్రంలో నటించి హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైంది నీనా గుప్తా.అయితే అప్పట్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ సినీ కెరీర్ పరంగా నీనా గుప్తా బాగా రాణించింది.

 Bollywood Heroine Neena Gupta Sensational Comments On Her Lover-TeluguStop.com

అంతేగాక ఒకప్పుడు బాలీవుడ్లోని దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది.అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో వెస్టిండీస్ క్రికెటర్ వివి  రిచర్డ్స్ తో ప్రేమలో పడింది.

అయితే ఆ తరువాత అతనికి పెళ్ళయిందని తెలిసినా కూడా దాదాపుగా పదేళ్లకు పైగా ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు.ఆ తరువాత వివి  రిచర్డ్స్ భార్య తన కోసం తరచు వివాదాలు పడుతుండటంతో నీనా గుప్తా ని రిచర్డ్స్ వదిలిపెట్టాల్సి వచ్చింది.

అయితే అప్పటికే ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో నీనా గుప్తా కి ఒక బిడ్డ కూడా జన్మించింది.అయితే ఆ సమయంలో రిచర్డ్స్ ని పెళ్లి చేసుకోమని అడిగినా ఫలితం లేకపోయింది.

ఈ మధ్యకాలంలో ఈ విషయంపై నీనా గుప్తా బాధపడుతోంది.అంతేకాక జీవితంలో ఎవరూ లేకపోతే ఒంటరిగా అయినా బ్రతకాలి కానీ పెళ్లి అయిన వ్యక్తితో మాత్రం ఎఫైర్ పెట్టుకోవద్దని నా అనుభవంతో చెబుతున్నానని ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

అంతేగాక భర్త లేక తాను తండ్రి లేక తన కూతురు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నామని వాపోయింది నీనా గుప్తా.దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

అంతేగాక జీవితంలో మనం అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారని వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అని అంటూ ధైర్యం చెబుతున్నారు.

Telugu Neena Gupta, Neenagupta-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా నేనా గుప్త ఇటీవల కాలంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రముఖ పాత్ర పోషించిన టువంటి పంగా అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే శుభ్ మంగళ్ జ్యాదా సావదన్ అనే చిత్రంలో కూడా నటించింది.

అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube