బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తెలుగు సినిమాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.ఈ క్రమంలోనే జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు.
లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం,జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
తానెప్పుడూ తెలుగు సినిమాలలో నటించనని, తనకు ప్రాంతీయ బేదం ఉందని నటుడు జాన్ అబ్రహం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.

ఇక గతంలో జాన్ అబ్రహం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.ఇక ఈ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న నటుడు జాన్ అబ్రహంను ప్రశ్నించగా ఈ ప్రశ్నకు జాన్ అబ్రహం సమాధానం చెబుతూ తాను ఎలాంటి తెలుగు సినిమాలలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇతర బాలీవుడ్ హీరోల మాదిరిగా డబ్బు కోసం నేను పరభాషా చిత్రాల్లో నటించనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
తాను బాలీవుడ్ హీరో మాత్రమేనని కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తానని ఈ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.