ఆ హీరోను ఐదుసార్లు ఏడిపించిన నాని.. ఏమైందంటే..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాని తొలి సినిమా నుంచి వీ సినిమా వరకు ప్రతి సినిమాలో తన నాచురల్ యాక్టింగ్ తో నాచురల్ స్టార్ గా మంచి పేరును సంపాదించుకున్నారు.నాని నటించిన జెర్సీ సినిమా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

 Bollywood Hero Shahid Kapoor Interesting Comments About Nani-TeluguStop.com

హిందీ వెర్షన్ కు కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉండటం గమనార్హం.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జెర్సీ సినిమాలో నాని నటన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Bollywood Hero Shahid Kapoor Interesting Comments About Nani-ఆ హీరోను ఐదుసార్లు ఏడిపించిన నాని.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జెర్సీ సినిమా చూస్తున్న సమయంలో నాని తనను నాలుగైదు సార్లు ఏడిపించాడని తన హృదయానికి దగ్గరైన సినిమాలలో జెర్సీ సినిమా ఒకటని షాహిద్ అన్నారు.నాని జెర్సీ మూవీలో అద్భుతంగా నటించాడని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన వయస్సు 40 సంవత్సరాలు అని షాహిద్ కపూర్ అన్నారు.

Telugu Bollywood Hero, Goutham Tinnanuri, Interesting Comments, Jersey Hindi Remake, Jersey Movie, Nani, Shahid Kapoor Cried-Movie

లైఫ్ లో ఆలస్యంగా సక్సెస్ అందుకోవడం ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసని తాను కూడా ఆలస్యంగా సక్సెస్ ను సొంతం చేసుకున్న వాడినేనని షాహిద్ చెప్పుకొచ్చారు.జెర్సీ మూవీలో నన్ను నేను రిలేట్ చేసుకున్నానని షాహిద్ వెల్లడించటం గమనార్హం.కరోనా సమయంలో 47 రోజులు ఈ మూవీ షూటింగ్ జరిగిందని లైఫ్ కు రిస్క్ అని తెలిసినా షూటింగ్ లో పాల్గొన్నారని షాహిద్ వెల్లడించారు.

Telugu Bollywood Hero, Goutham Tinnanuri, Interesting Comments, Jersey Hindi Remake, Jersey Movie, Nani, Shahid Kapoor Cried-Movie

షాహిద్ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తుండటం గమనార్హం.షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేయగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న సంగతి తెలిసిందే.

#Nani #JerseyHindi #ShahidKapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు