హృతిక్ వెబ్ సిరీస్… ఏకంగా 90 కోట్లు రెమ్యునరేషన్  

Hrithik Roshan being offered Rs 90 crore by an OTT, Bollywood, Tollywood, Digital Entertainment, Web Series, Digital Shows - Telugu Bollywood, Digital Entertainment, Digital Shows, Hrithik Roshan, Tollywood, Web Series

ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో చాలా వరకు ప్రజలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు.సినిమాల రిలీజ్ కూడా తగ్గిపోవడంతో వాటి స్థానంలో వెబ్ సిరీస్ లు ఎక్కువగా వీక్షించారు.

TeluguStop.com - Bollywood Hero Hrithik Roshan 90 Crores Remuneration Web Series

ఈ ఆరు నెలల కాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి చేరువ అయిన వారి సంఖ్య గణనీయగా పెరిగింది.ఈ విషయాన్ని స్టార్ దర్శకులు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి.

ఈ నేపధ్యంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ద్వారా అందించే వెబ్ సిరీస్ లు నిర్మించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.వెబ్ సిరీస్ ల కోసం స్టార్ హీరో, హీరోయిన్లుని కూడా సంప్రదిస్తూ వారికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు.

TeluguStop.com - హృతిక్ వెబ్ సిరీస్… ఏకంగా 90 కోట్లు రెమ్యునరేషన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక హీరో, హీరోయిన్లు సైతం రెమ్యునరేషన్ పరంగా, అలాగే కెరియర్ పరంగా వెబ్ సిరీస్ లు సంతృప్తికరంగా అనిపించడంతో చేయడానికి ముందుకొస్తున్నారు.ఆ మధ్య అక్షయ్ కుమార్ కి ఓ వెబ్ సిరీస్ కోసం ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు.

తాజాగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ఓ వెబ్‌ షో చేయబోతున్నారని టాక్‌.ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం కూడా అందబోతోందని సమాచారం.ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ యాక్షన్‌ నిండిన ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతోందట.ఇందులో హృతిక్‌ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారని సమాచారం.ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్‌కు హృతిక్‌ సుమారు 90 కోట్లు తీసుకోనున్నారని తెలుస్తుంది.భారతీయ భాషలన్నింట్లోనూ ఈ సిరీస్‌ విడుదల కానుందని టాక్‌.

ఈ సిరీస్‌లో హృతిక్‌ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారని టాక్.ఈ ఏడాది చివర్లో ఈ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

#Digital Shows #Hrithik Roshan #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Hero Hrithik Roshan 90 Crores Remuneration Web Series Related Telugu News,Photos/Pics,Images..