గత కొద్దీరోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamannaah ), బాలీవుడ్ హీరో విజయ్ వర్మ( Vijay Verma ) ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఇప్పటివరకు ఈ వార్తలపై తమన్న కానీ ఇది విజయవర్మ కాని స్పందించలేదు.మొన్నటికి మొన్న విజయ్ వర్మ ఫ్రెండ్ నటుడు గుల్షన్ దేవయ్య తమన్నా, విజయ్ ల రిలేషన్ గురించి సరదాగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
దాంతో గుల్షన్ దేవయ్యపై దారుణంగా ట్రోలింగ్స్ చేశారు నెటిజన్స్.

ఇది ఇలా ఉంటే తాజాగా గుల్షన్ దేవయ్య ( Gulshan Devayya )ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ మరోసారి ఈ విషయంపై స్పందించారు.పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియాతో గుల్షన్ మాట్లాడగా అందులో తమన్నా-విజయ్ వర్మల గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.నేను, విజయ్ వర్మ మంచి స్నేహితులము.
తను తమన్నాతో ప్రేమలో ఉన్నాడా లేదా అనే విషయం నాకు తెలీదు.వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు మాత్రమే నేను చూశాను.
నేనెప్పుడూ తమన్నాను కలవలేదు.ఆమె ఎవరో కూడా నాకు తెలీదు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె గురించి మాట్లాడినందుకు ఆమె అభిమానులు నన్ను ట్రోల్ చేశారు.అది వాళ్లిద్దరి వ్యక్తిగత విషయం.

నేను విజయ్ వర్మను సరదాగా ఏడిపించడం కోసం అలా మాట్లాడాను.ఈసారి ఆ విషయం గురించి మాట్లాడితే తమన్నానే నన్ను కొడుతుందేమో.నా చెంప చెళ్లుమనడం నాకు ఇష్టం లేదు అంటూ నవ్వులు పూయించాడు గుల్షన్ దేవయ్య.ఇకపోతే తమన్నా ఏడాది ఆరంభంలో న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా జరిగిన కార్యక్రమంలో తమన్న విజయ్ వర్మ ని ముద్దు పెట్టుకోవడంతో అప్పటి నుంచి ఈ వార్తలు మొదలయ్యాయి.
అయితే ఇప్పట్లో ఈ వార్తలకు పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు.మరి ఈ వార్తలపై తమన్న విజయ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.
