ఆ హీరో ని పెళ్లి చేసుకుంటామని వెంట పడుతున్న అబ్బాయిలు  

బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోమని అడుగుతున్న అబ్బాయిలు. .

Bollywood Hero Got Proposals From Gay Boys In Social Media-

ఈ మధ్యకాలంలో సొసైటీలో స్వలింగ సంపర్కం అనేది చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది.ఆ మధ్య సుప్రీం కోర్టు కూడా స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని చెప్పడంతో చాలామంది నేరుగా బయటకు వచ్చి తమ రిలేషన్ గురించి, తమ జండర్ గురించి చెప్పుకుంటున్నారు.కొంతమంది మరో ముందు అడుగు వేసి పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు..

Bollywood Hero Got Proposals From Gay Boys In Social Media--Bollywood Hero Got Proposals From Gay Boys In Social Media-

ఆడ ఆడ, మగ మగ మధ్య రిలేషన్ ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ హీరోకి చేదు అనుభవం ఎదురైంది.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథతో తెరకెక్కిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ పాత్రను పోషించిన వ్యక్తి అర్జున్ మాథుర్.

ఈ కుర్ర హీరో నటించిన మొదటి బాలీవుడ్ సినిమా కూడా ఇదే.ఈ సినిమాకి ముందు ఇతను మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లో గే పాత్రలో నటించాడు.ఈ పాత్ర ప్రభావం ఇప్పుడు అతని రియల్ లైఫ్ లో కూడా పడింది.

చాలామంది సోషల్ మీడియాలో అతనికి అసభ్యకర సందేశాలు పంపిస్తూ తనను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఇలా మెసేజ్ లు చేస్తున్న వారిలో చాలా మంది అబ్బాయిలే ఉన్నారని, వాళ్ళందరూ తాను కూడా గే అనే ఫీలింగ్ తో ఇలా మెసేజ్ లు పెడుతూ తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాడు.అయితే తాను వెబ్ సీస్ లో చేసిన పాత్రని నిజజీవితంలో ఆపాదించుకొని తను అలాగే చూడటం సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.