తన ప్రియురాలి గురించి అలాంటి వార్తలు ప్రచారం చేసారంటూ ఫైర్ అయిన హీరో....

బాలీవుడ్ సినీ టౌన్ లో ప్రేమ, పెళ్లి విషయాలపై గాసిప్స్ వినిపించటం సినీ ప్రేక్షకులకి కొత్తేమీ కాదు.కాగా ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో “అర్జున్ కపూర్” టాలీవుడ్ హీరోయిన్ మరియు స్పెషల్ సాంగ్ బ్యూటీ మలైకా అరోరా తో గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Bollywood Hero Arjun Kapoor Fire On Media For False News Spreading About Actress-TeluguStop.com

దీంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా మాత్రం తమ పెళ్లి విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే తాజాగా అర్జున్ కపూర్ మలైకా అరోరా గురించి ప్రచారం చేసిన ఓ వార్త గురించి స్పందిస్తూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా కొంతమంది మలైకా అరోరా సంపాదనను తన సంపాదనతో పోలుస్తూ తప్పుడు ప్రచారాలు చేశారని అంతేకాకుండా తమ మధ్య ఎలాంటి ఆర్థికపరమైన భేదాలు లేవని స్పష్టం చేశాడు.అలాగే ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి అసత్య కథనాలను ప్రచారం చేయడం సరికాదని కూడా హెచ్చరించాడు.

Telugu Arjun Kapoor, Bollywood, Bollywoodarjun, Malaika Arora-Movie

కాగా ఇటీవలే ఓ ప్రముఖ ఇంగ్లీషు వెబ్ సైట్ మలైకా అరోరా అర్జున్ కపూర్ కంటే తక్కువ సంపాదిస్తున్నారని అందువల్లనే ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య ఆర్థికంగా విభేదాలు వచ్చినట్లు ఒక కథనాన్ని ప్రచురించింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Telugu Arjun Kapoor, Bollywood, Bollywoodarjun, Malaika Arora-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అర్జున్ కపూర్ హీరోగా నటించిన “సర్దార్ కా గ్రాండ్ సన్” చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటీలో విడుదల చేయగా బాగానే హిట్ అయింది.కాగా ప్రస్తుతం అర్జున్ కపూర్ “ఏక్ విలన్ రిటర్న్స్, భూత్ పోలీస్” తదితర చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.ఇక మలైకా అరోరా విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తుండడంతో పాటు మరిన్ని చిత్రాలకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.అలాగే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత ముంబైలో ఉన్నటువంటి సొంత నివాసంలో ఒంటరిగా ఉంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube