ఆహా.. కైరా అద్వానీ కన్నుగీటు వీడియో మాములుగా లేదుగా!

భారతీయ సినిమా నటి కైరా అద్వానీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న కైరా తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

 Bollywood Diva Kiara Advani Winiking In Manali Snow-TeluguStop.com

ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ బిజీగా ఉంటోంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ.ఇక ఈమెకున్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.

2014లో ‘ఫగ్లీ‘ సినిమాతో హిందీలో తొలిసారిగా వెండితెరకు పరిచయము కాగా.ఈ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది.అంతేకాకుండా 2016 లో ఎం.ఎస్ ధోని సినిమాలో నటించగా ఆ సినిమాలో తన నటనకు గుర్తింపు పొందింది.ఇక 2018 లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తో తెలుగులో తొలిసారి పరిచయం కాగా వసుమతి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

 Bollywood Diva Kiara Advani Winiking In Manali Snow-ఆహా.. కైరా అద్వానీ కన్నుగీటు వీడియో మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా వినయ విధేయ రామ సినిమాలో కూడా బాగా నటించింది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయగా.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.ప్రస్తుతం కైరా అద్వానీ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లో అందమైన లొకేషన్లలో ఎంజాయ్ చేస్తుంది.

మొత్తం మంచు తో కూడిన పర్వతాల మధ్య పైనుంచి మంచి కురుస్తూ కెమెరా వైపు చూస్తూ కన్నుగీటుతూ కనిపిస్తుంది.ఇది చూసిన నెటిజనులకు బాగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భూల్ భూలయ్యా 2 సినిమాల్లో నటిస్తుంది.ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలీ లో జరుగుతుంది.ఇందులో మొదటి భాగంను ప్రియదర్శన్ దర్శకత్వం చేసాడు.

#Winiking #Manali Snow #Kiara Advani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు