సాయి పల్లవిని లాంచ్ చేయాలని ట్రై చేస్తున్న హిందీ దర్శకులు

సౌత్ లో హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న అందాల భామ సాయి పల్లవి.ప్రస్తుతం హీరోయిన్స్ గా బెస్ట్ డాన్సర్ గా సాయి పల్లవి క్రేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది.

 Bollywood Directors Try To Launch Sai Pallavi In Hindi-TeluguStop.com

ఆమె పాట అంటే యూత్ ఎగబడి మరీ చూస్తున్నారు.ఈ కారణంగానే రౌడీ బేబీ ఏకంగా వంద కోట్ల మంది వీక్షించి ఇండియన్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

దీని సమీపంలో బాలీవుడ్ సాంగ్స్ కూడా లేకపోవడం విశేషం.ఈ మధ్యకాలంలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ అంటే కచ్చితంగా సాయి పల్లవి అని చెప్పాలి.

 Bollywood Directors Try To Launch Sai Pallavi In Hindi-సాయి పల్లవిని లాంచ్ చేయాలని ట్రై చేస్తున్న హిందీ దర్శకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ హీరోయిన్స్ కి అయిన వారి అందం బట్టి ఫాన్స్ ఉంటారు.వారి కోసం ప్రత్యేకంగా సినిమాలకి వెళ్ళేవారు చాలా తక్కువ.

కాని సాయి పల్లవికి హీరోల స్థాయిలో క్రేజ్ ఉంది.ఆమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే దానికి విపరీతమైన క్రేజ్ వస్తుంది.

Telugu Bollywood Directors, Hindi, Kollywood, Love Story, Sai Pallavi, Tollywood, Viratparvam Movie-Movie

ఆమె నటన, డాన్స్ చూడటానికి సినిమాకి వెళ్ళే ఫ్యాన్ బేస్ సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవి మాత్రమే దక్కించుకుంది.తెలుగులో ఆమె నటించిన లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.అలాగే శ్యామ్ సింగరాయ్ షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకులు సైతం సాయి పల్లవిని హిందీలోకి పరిచయం చేయడం కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

కొంత మంది దర్శకులు ఇప్పటికే ఈ అమ్మడుకి కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు నేరుగా సాయి పల్లవితో సినిమా చేయడానికి ముందుకోస్తున్నట్లు బిటౌన్ లో టాక్.

బాలీవుడ్ లో గ్లామర్ తో పాటు మంచి టాలెంట్ ఉన్న నటీమణులకి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.ఈ కారణంగా తాప్సి, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ అక్కడ లేడీ ఒరియాంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

ఇప్పుడు సాయి పల్లవి హిందీలోకి ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

#Love Story #Hindi #Kollywood #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు