బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ దర్శకులు రాజ్ అండ్ డీకే. తెలుగు మూలాలు ఉన్న వీరు ఇద్దరు ఇటీవల తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది.
దాంతో వీరికి వందల కోట్ల ప్రాజెక్ట్ లు చేతికి వస్తున్నాయి.గతంలో వీరు తెలుగులో సినిమా చేశారు.
ఆ సినిమా పెద్దగా ఆడలేదు.దాంతో హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు.
ప్రముఖ హీరోలు మరియు హీరోయిన్స్ అంతా కూడా వీరి దర్శకత్వంలో నటించాలని ఆశ పడుతున్న ఈ సమయంలో వీరు మాత్రం తెలుగులో వరుసగా సినిమాలను చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఒక వైపు హిందీ సినిమాలను తెరకెక్కిస్తూనే మరో వైపు తెలుగు సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను నిర్మించాలని వీరు ప్లాన్ చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దర్శక ద్వయం తెలుగులో నిర్మించబోతున్న కొత్త సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది.వీరికి ఇప్పటికే ఒక యంగ్ హీరో డేట్లు కూడా ఇచ్చాడట.
ఇటీవల సినిమా బండి అనే చిన్న వెబ్ మూవీని నిర్మించిన వీరు తెలుగులో మరిన్ని సినిమాలను నిర్మించేందుకు సిద్దం అవ్వడంతో పలువురు కొత్త దర్శకులు కథలు పట్టుకుని క్యూ కట్టారు.ప్రముఖ స్టార్ హీరోల తో సినిమాలు చేయాలంటే మొదట చిన్న సినిమాలతో నిరూపించుకోవాలి.

అందుకే రాజ్ అండ్ డీ కే లు ఇచ్చే అవకాశంతో తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాజ్ డీకే లు వచ్చే ఏడాదికి కనీసం నాలుగు సినిమా లు మరియు ఒక వెబ్ సిరీస్ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.మరి ఈ ప్రాజెక్ట్ లు అన్ని కూడా ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాయి అనేది చూడాలి.