డార్లింగ్ ప్రభాస్ వెంట పడుతున్న బాలీవుడ్ దర్శకులు

ఇండియన్ వైడ్ గా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడని చెప్పాలి.బాహుబలి తర్వాత అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 Bollywood Directors Focus On Prabhas Craze, Tollywood, Radheshyam Movie, Adi Pur-TeluguStop.com

ఇక సాహో సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకి మరింతగా చేరువ అయ్యాడు.ఒకప్పుడు సౌత్ హీరోల సినిమాలు అంతగా చూడటానికి ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.

అయితే బాహుబలి మేనియా దేశం మొత్తం పని చేసింది.దీంతో సౌత్ ఇండియా సినిమా సత్తా కూడా అందరికి తెలిసింది.

ఈ నేపధ్యంలో తరువాత వచ్చిన కేజీఎఫ్ సినిమాకి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.అలాగే యుట్యూబ్ లో డబ్బింగ్ చేసి వదిలిన సౌత్ సినిమాలని విపరీతంగా వీక్షిస్తున్నారు.

ఇక డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండగా అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ తో కావడం విశేషం.

Telugu Adi Purush, Om Raut, Prabhas Crazy, Radheshyam, Salaar, Siddardh Anand, T

ఈ నేపధ్యంలో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఆది పురుష్ సినిమాకి మంచి హైప్ ఉంది.ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు పాన్ ఇండియా కథలని సిద్ధం చేసుకొని ప్రభాస్ తో కలుస్తున్నారని తెలుస్తుంది.రీసెంట్ గా సిద్ధార్ధ ఆనంద్ ఓకే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ప్రభాస్ కి నేరేట్ చేసాడని, ఈ సినిమా ఒకే అయిపోయిందని టాక్ వినిపిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుందని సమాచారం.ఇక సంజయ్ లీలా బన్సాలీ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

అలాగే ధూమ్ సీరీస్ 4లో ప్రభాస్ ని విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.ఇలా బాలీవుడ్ దర్శక, నిర్మాతలు దృష్టి అంతా ఇప్పుడు ప్రభాస్ మీద ఉందనే మాట ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube