రోహిత్ శర్మ లవ్ స్టొరీతో బాలీవుడ్ లో మూవీ

ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే డబుల్ సెంచురీలు మూడు ఉన్న ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ.

 Bollywood Director Plan To Movie On Rohit Sharma Love Story-TeluguStop.com

ఇక రోహిత్ బరిలోకి దిగితే అవతలి బౌలర్ ఎలాంటి వాడైన హడాలిపోవాల్సిందే.అలాంటి సత్తా ఉన్న క్రికెటర్ కి అదిరిపోయే లవ్ స్టొరీ ఒకటి ఉంది.

ఆరేళ్ళ పాటు ఒక అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకున్నాడు.వారి లవ్ స్టొరీలో చాలా ఇంటరెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఒక క్రికెటర్ లవ్ స్టొరీ అంటే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాలీవుడ్ దర్శకులు అతని ప్రేమ కథపై ఫోకస్ పెట్టారు.

రోహిత్ శర్మ ప్రేమ కథ గురించి తెలుసుకున్న బాలీవుడ్ అగ్ర దర్శకుడు అతని బయోపిక్ కంటే లవ్ స్టొరీ ఇంటరెస్టింగ్ గా ఉందని దానినే తెరపై ఆవిష్కరించాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడువుగా రోహిత్ శర్మని కలిసి అతని ప్రేమ కథ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ ఆసక్తి చూపించడంతో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోగా రణవీర్ కపూర్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.ఇక దీనికి రోహిత్ శర్మ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటాడని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వనున్నట్లు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube