ఐపీఎల్ టీమ్ కోనేందుకు సిద్దమైన బాలీవుడ్ క‌పుల్.. కార్పొరేట్ కంపెనీలు కూడా వారికే సపోర్ట్?

Bollywood Couple Ranveer Singh And Deepika Padukone Set A Bid For Ipl Team

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ జంట నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నారు.

 Bollywood Couple Ranveer Singh And Deepika Padukone Set A Bid For Ipl Team-TeluguStop.com

ఇలా నిర్మాణరంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీపిక పదుకొనే తాజాగా తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు.

మనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న క్రీడలలో క్రికెట్ ఒకటని చెప్పవచ్చు.

 Bollywood Couple Ranveer Singh And Deepika Padukone Set A Bid For Ipl Team-ఐపీఎల్ టీమ్ కోనేందుకు సిద్దమైన బాలీవుడ్ క‌పుల్.. కార్పొరేట్ కంపెనీలు కూడా వారికే సపోర్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రికెట్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈ క్రమంలోనే మన దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న క్రికెట్ లో ఈ జంట భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ భాగస్వామ్యం అయ్యారు.ప్రస్తుతం ఐపీఎల్ లో ఎనిమిది టీమ్స్ ఆడుతుండగా.

వచ్చే ఏడాది మరిన్ని టీమ్స్ పెంచాలని క్రికెట్ బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఈక్రమంలోనే బిసిసీఐ బిడ్స్ కోసం ఆహ్వానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే దీని కోసం బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ దీపిక రణవీర్ అప్లై చేసినట్లు సమాచారం.

Telugu Bollywood, Deepika Singh, Ipl 2022, Ipl Team, Ranveer Singh, Sports, Sports News-Movie

అయితే ఇలా ఐపీఎల్ లో భాగస్వామ్యం కావడానికి దీపికాకు అంత డబ్బు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ వీరి పేర్లను ముందు ఉంచి వీరి వెనక ఓ కార్పొరేట్ సంస్థ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తున్నారని సమాచారం వినబడుతోంది.ఈ బిట్స్ కోసం దీపిక జంట అప్లై చేయగా వీటి ఫలితాలు అక్టోబర్ 25వ తేదీన తెలియనున్నాయి.ఈ జంటతో పాటు పలువురు ఈ బిడ్స్ కోసం అప్లై చేయగా ఇది ఎవరికి దక్కుతుందో తెలియాలంటే 25వ తేదీ వరకు వేచి చూడాలి.

#Deepika Singh #Ranveer Singh #IPL Team #IPL

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube