బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మృతి  

Bollywood choreographer Saroj Khan passes away, Bollywood,Tollywood, Indian Cinema, Bollywood Celebrities - Telugu Bollywood, Bollywood Celebrities, Bollywood Choreographer Saroj Khan Passes Away, Indian Cinema, Tollywood

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఏడాది ఆరంభం నుంచి బాలీవుడ్ సినీ ప్రముఖులలో మృత్యువాతకి సంబందించిన ఘటనలు ప్రతి నెలలో వినాల్సి వస్తుంది.

 Bollywood Choreographer Saroj Khan Passes Away

తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.తన తల్లి గుండెపోటుతో కన్నుమూసిందని ఆమె కూతురు ధ్రువీకరించారు.71 ఏళ్ల సరోజ్‌ఖాన్ శ్వాస కోస సమస్యలతో గత నెల 20వ తేదీన బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు.సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది.

అయితే ఈ రోజు ఆమె గుండెపోటుతో మరణించింది.

బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మృతి-Movie-Telugu Tollywood Photo Image

సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు.

దేవదాస్ సినిమాలోని దోలా రే దోలా, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ఏక్ దో తీన్, జబ్ వీ మెట్ సినిమాలోని యే ఇష్క్ హై పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆమె మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు.

అయితే కరోనా సిచువేషన్ కారణంగా ఆమె చివరి చూపు చూడటానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.ఈ రోజు సాయంత్రంకి ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Choreographer Saroj Khan Passes Away Related Telugu News,Photos/Pics,Images..