మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదు.. మహేష్ వ్యాఖ్యలపై కంగనా కామెంట్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ పై తనకు ఆసక్తి లేదని తాను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో కంఫర్ట్ గా ఉన్నానని, బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్తే తనని భరించలేరు అంటూ మహేష్ బాబు కామెంట్ చేశారు.

 Bollywood Cant Stand Mahesh Babu Kangana Comments On Mahesh Words, Mahesh Babu, Tollywood, Bollywood, Kangana, Comments, Telugu Film Industry-TeluguStop.com

ఈ క్రమంలోనే మహేష్ బాబు వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పలువురు ఈయనపై విమర్శలు చేస్తూ వివాదం సృష్టించారు.ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ మహేష్ బాబు అన్న విషయంలో ఏ మాత్రం తప్పు లేదని ఆయనకు సపోర్ట్ చేశారు.

తాజాగా వివాదాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలపై స్పందించిన తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 Bollywood Cant Stand Mahesh Babu Kangana Comments On Mahesh Words, Mahesh Babu, Tollywood, Bollywood, Kangana, Comments, Telugu Film Industry-మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదు.. మహేష్ వ్యాఖ్యలపై కంగనా కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కంగనా నటించిన ధాకడ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మహేష్ బాబు అన్నది నిజమే ఆయనను నిజంగానే బాలీవుడ్ ఇండస్ట్రీ భరించలేదు.ఎందుకంటే ఎంతోమంది బాలీవుడ్ హీరోలు అతనితో కలిసి పని చేయడానికి తనని సంప్రదించారో నాకు తెలుసు.ప్రస్తుతం దేశంలోని టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో ఉంది కనుక తనకు అదే ఇండస్ట్రీ ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని, టాలీవుడ్ కు మించి ఆయనకు బాలివుడ్ రెమ్యూనరేషన్ ఇవ్వలేదని కంగనా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరి ఈ విషయాన్ని ఎందుకంత పెద్దది చేసి వివాదం సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube