బాయ్‌కాట్ ఆదిపురుష్.. ప్రభాస్ కు తప్పని బాయ్‌కాట్ తిప్పలు!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది.సినిమాలో ఏదైనా తమకు నచ్చని సన్నివేశాలు ఉంటే వెంటనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలని పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు.

 Bollywood Boycott Trend Hits Prabhas Adipurush Movie Details, Boycott Adipurush,-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో సినిమాలకు ఇలా బాయ్‌కాట్ సెగ తగిలింది.ఇకపోతే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ఈ టీజర్ చూసినటువంటి కొందరు పెద్ద ఎత్తున ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమాని ఎందుకు బాయికాట్ చేయాలి అనే విషయానికి వస్తే.రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Bollywood Boycott Trend Hits Prabhas Adipurush Movie Details, Boycott Adipurush,-TeluguStop.com

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు.అదేవిధంగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే రావణాసురుడి పాత్ర పై కొందరు హిందువులు ఈ సినిమాని బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Telugu Bollywood, Kriti Sanon, Prabhas, Saif Ali Khan-Movie

ముస్లిం వ్యక్తి అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడం ఏంటి.ఆయన లుక్ చూడటానికి ఔరంగ జేబు, అల్లావుద్దీన్, ఖల్జీలను పోలి ఉంటుంది.ఇలాంటి ముస్లిం వ్యక్తి రావణాసురుడి పాత్రలో నటించడానికి కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇక ఈ సినిమాలు ఆంజనేయ స్వామి పాత్రలో నటించినటువంటి నటుడు దేవదత్త సైతం ముస్లిం వ్యక్తుల పోలికలతో కనిపించడం వల్ల ఈ సినిమాని చాలామంది బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఒక సినిమాని సినిమాలా కాకుండ, సినిమాలలో కూడా కులమతాలను పోలుస్తూ సినిమాని బాయ్‌కాట్ చేయాలనడం సమంజసం కాదని ఈ సినిమాని సినిమా లాగా చూసి ఆనందపడాలంటూ మరికొందరు బాయ్‌కాట్ విధానాన్ని తప్పుపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube