ఇంకోసారి ముద్దు పెడితే పెదాలు కోసేస్తా అంటున్న నటి...  

Big Kiss Controversy In Bollywood Big Boss Season 13 - Telugu Big Boss Bollywood, Big Boss Mahira Sharma, Big Boss Paras Bigg Boss 13, Bollywood, Paras Chhabra, Salman Khan

ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బాస్  షో టిఆర్పి రేటింగులు పరంగా అదరగొడుతోంది.ఈ షో ఇప్పటికే 12 సీజన్లు  విజయవంతంగా పూర్తిచేసుకొని 13వ సీజన్  కూడా విజయవంతంగా దూసుకుపోతోంది.

Big Kiss Controversy In Bollywood Big Boss Season 13

ఈ షోకి కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే టిఆర్పిల పరంగా దూసుకుపోతున్న ఈ షోలో వివాదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి.

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి పరాస్ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి.అయితే ఇది ఇలా ఉండగా తాజాగా మరో కంటెస్టెంట్ అయినటువంటి మహిరా బుగ్గపై పరాస్ అనుమతి లేకుండా ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికే పలుసార్లు ముద్దు పెట్టాడు కూడా.అంతేకాక ముద్దు పెట్టనిదే నిద్ర లేవ న మహీరా కి షరతు కూడా పెట్టాడు.అయితే ఈ విషయాలు మహీరాకి నచ్చేవి కాదు.ఎన్నోసార్లు ఈ విషయం గురించి పరాస్ కి చెప్పాలని ప్రయత్నించింది.

అయితే తాజాగా జరిగినటువంటి ఓ ఎపిసోడ్ లో కూడా మళ్ళీ మహీరాకి ముద్దు పెట్టాలని చూశాడు.దీంతో ఆమె ఆగ్రహానికి గురవుతూ ఇంకోసారి తనకు ముద్దు పెట్టాలని చూస్తే పెదాలు కోసేస్తానంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

దీంతో పరాస్ అక్కడినుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు.

అయితే ఈ ముద్దుల వివాదం ప్రస్తుతం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.అంతేకాకుండా ఈ విషయం పై పలువురు బిగ్ బాస్ షో అభిమానులు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.ఆట పేరుతో ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఇంత జరుగుతున్నప్పటికీ ఈ షో వ్యాఖ్యాత అయినా సల్మాన్ ఖాన్ మాత్రం వీటిపై స్పందించకపోవడంతో పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Kiss Controversy In Bollywood Big Boss Season 13 Related Telugu News,Photos/Pics,Images..

footer-test