బ్రెయిన్ స్ట్రోక్ నుంచి పూర్తిగా కోలుకున్న బిగ్ బాస్ విన్నర్...

హిందీ లో ఎంతగానో పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రాయ్ ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో అభిమానులు మరియు పలువురు సెలబ్రిటీలు రాహుల్ రాయ్ తొందరగా కోలుకోవాలని అంటూ సోషల్ మీడియా మధ్యమాలలో దేవుడిని ప్రార్థించారు.

 Bollywood Big Boss Season One Winner Rahul Roy Recovered From Brain Stroke, Rah-TeluguStop.com

కాగా తాజాగా రాహుల్ రాయ్ తన బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు.  అంతేగాక  తానూ తొందరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతీ అభిమానికి మరియు సెలెబ్రెటీకి ధన్యవాదాలు తెలిపాడు.

ఈ విషయానికి సంబందించిన ఓ వీడియోని కూడా షేర్ చేశాడు.అంతేగాక తాను బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నప్పుడు నానావతి ఆసుపత్రి సభ్యులు తనను ఎంతో బాగా చూసుకున్నారని అందుకుగాను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా తాను ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని కానీ మరి కొంతకాలం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలిపాడు.ఈ విషయం ఇలా ఉండగా రాహుల్ రాయ్ ప్రస్తుతం హిందీ లో ప్రముఖ దర్శకుడు మెహి కను దర్శకత్వం వహిస్తున్న “ఆగ్రా” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాహుల్ రాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.కాగా రాహుల్ రాహుల్ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో యధావిధిగా  ఈ చిత్ర షూటింగ్ పనుల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube