పూజా హెగ్డేకు ఎసరుపెట్టిన కొత్త పిల్ల

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ ఫాంలో ఉంది.గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, యంగ్ హీరో అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

 Bollywood Beauty Scares Pooja Hegde-TeluguStop.com

ఈ రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అమ్మడుకి మంచి క్రేజ్ ఉండటంతో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

అయితే బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఫేం తెచ్చుకుంటున్న ఓ చిన్నది పూజా హెగ్డేను భయపెడుతుందట.మలయాళ స్టార్ హీరో దుల్కర్ సాల్మన్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

 Bollywood Beauty Scares Pooja Hegde-పూజా హెగ్డేకు ఎసరుపెట్టిన కొత్త పిల్ల-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో దుల్కర్ సాల్మన్ ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డే పేరు బాగా వినిపించింది.కానీ ప్రేక్షకులకు కొత్త మొఖాన్ని పరిచయం చేస్తే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్, బాలీవుడ్‌లో ఇప్పుడే ఫేం తెచ్చుకుంటున్న బ్యూటీ మృనాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే దుల్కర్ సాల్మన్ చిత్రంలో నటించేందుకు తన రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించుకుందట పూజా హెగ్డే.

అయినా చిత్ర దర్శకనిర్మాతలు పూజాను పక్కనబెట్టి ఇలా కొత్త పిల్ల వెంట పడుతుండటంతో, తన కెరీర్‌కు ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అమ్మడు వణికిపోతుందట.

ఏదేమైనా ఒక కొత్త హీరోయిన్ వల్ల స్టార్ స్టేటస్‌లో ఉన్న పూజా హెగ్డే భయపడుతుందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

ఇక ఈ బ్యూటీ నటిస్తున్న రెండు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యి ఆమెకు మంచి పేరు తీసుకొస్తే తప్ప తనకు తిరిగి అవకాశాలు దక్కకపోవచ్చనే టాక్ కూడా సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.మరి దుల్కర్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

#Mrunal Thakur #Dulquer Salmaan #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు