ఒకప్పుడు లాటరీ టికెట్లు అమ్మేదాన్ని.. నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ హీరోయిన్!

బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి.2018 లో దిల్బర్ అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటించగా ఆ వీడియో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.అంతే కాకుండా యూట్యూబ్ లో ఒక బిలియన్ అంటే నూరు కోట్ల వ్యూస్ తో సంచలనం సృష్టించింది.

 Bollywood Beauty Nora Fatehi Talking About Her Struggles , Nora Fatehi, Bollywoo-TeluguStop.com

గఇక ఈమె డాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.నోరా ఫతేహి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇక ఈమె బాలీవుడ్ లో భారత్, స్త్రీ, బాట్లా హౌస్హౌస్,రోర్, సత్యమేవ లాంటి సినిమాల్లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.అదే విధంగా టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటలు కూడా అద్భుతంగా స్టెప్పులు వేసి అద్దరగొట్టింది.

అయితే పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నోరా ఫతేహి కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించిందట.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తాను జీవితంలో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

ఆమె 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఉద్యోగ జీవితం ప్రారంభించిందట.

Telugu Bollywood, Hot, Nora Fatehi, Struggles, Tollywood-Movie

ఆమె మొదటి ఉద్యోగం తన ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న ఒక మాల్ లో అసోసియేట్ గా మొదలైంది అని తెలిపింది.ఆమె కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నందువల్ల చిన్నతనంలోనే కుటుంబ పోషించడానికి ఆమె రకరకాల ఉద్యోగాలు చేసిందట.తాను రెస్టారెంట్ లలో,బార్ లలో, షావర్మా ప్లేస్ లలో వెయిట్రెస్స్ గా పని చేశానని, అంతేకాకుండా పురుషుల బట్టల దుకాణంలో కూడా పని చేశానని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే టెలిమార్కెటింగ్ కార్యాలయంలో, ప్రజలకు కాల్ చేయడం, లాటరీ టికెట్ లు అమ్మడం వంటివి కూడా చేశాను అని చెప్పుకొచ్చింది నోరా ఫతేహి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube