అవకాశాల కోసం బరువు బాగానే తగ్గిన బాలీవుడ్ బ్యూటీ..

సినిమా పరిశ్రమలో రాణించాలంటే కేవలం నటనా ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు.దర్శకనిర్మాతలు అనుకున్నట్లుగా ఆ పాత్రకి సూటయ్యే శారీరక ఆహార్యం, అందం, అభినయం వంటివి కూడా ఉండాలి.

 Bollywood Beautiful Bhumi Pednekar Weight Loss For Movie Offers-TeluguStop.com

అప్పుడే ఆ పాత్రకి వందకి వంద శాతం న్యాయం జరుగుతుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నటీనటులు కూడా ఎప్పటికప్పుడు శరీరాకృతి మరియు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తమని తాము తమ పాత్రలను సూటయ్యే విధంగా మలుచుకుంటున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ “భూమి పెడ్నేకర్” కూడా బరువు తగ్గే పనిలో పడింది.అయితే గతంలో లస్ట్ స్టోరీస్, టాయిలెట్, బాల, దుర్గ మతి,  తదితర చిత్రాలలోని పాత్రల కోసం ఈ అమ్మడు బాగానే బరువు పెరిగింది.

 Bollywood Beautiful Bhumi Pednekar Weight Loss For Movie Offers-అవకాశాల కోసం బరువు బాగానే తగ్గిన బాలీవుడ్ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి కొంతమేర సినిమా అవకాశాలు కరువవడంతో బరువు తగ్గేందుకు జిమ్లో వర్కవుట్ చేస్తూ బాగానే శ్రమిస్తోంది.ఈ క్రమంలో ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ కూడా నియమించుకుంది.

అంతేకాకుండా ఆహారపు డైట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.దీంతో ఈ లాక్ డౌన్ సమయంలోనే దాదాపుగా 10 కేజీలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం.

కాగా ఈ విషయానికి సంబంధించి ఇటీవలే భూమి పెడ్నేకర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా  ఫోటోలని షేర్ చేసింది.దీంతో ఈ అమ్మడి అందానికి  అభిమానులు అయ్యారు.

అయితే ఇటీవలే భూమి పెడ్నేకర్ బాలీవుడ్లో దుర్గమతి అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.కాగా ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “హర్షవర్దన్ కులకర్ణి” దర్శకత్వం వహిస్తున్న బాధాయి దొ, అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే “మిస్టర్ లీలే” అనే మరో హిందీ చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#BhumiPednekar #Bhumi Pednekar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు