బాలీవుడ్ టాప్ బ్యూటీస్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తమ సినిమాలు హిట్ కొడుతున్నా కొద్ది ఆయా నటీనటుల డిమాండ్ పెరుగుతుంది.రెమ్యునరేషన్ విషయలంలోనూ మార్పులు, చేర్పులు జరుగుతాయి.

 Bollywood Beauties First Remuneration , Bollywood Heroines, First Remunerations,-TeluguStop.com

ఒక్కసారి క్రేజ్ దక్కించుకుంటే చాలు సినిమా విజయం సాధించినా.పరాజయం పొందినా సంబంధం లేకుండా రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది.

అటు పారితోషికం విషయంలో బాలీవుడ్ హీరోయిన్లతో పోల్చితే.సౌత్ హీరోయిన్లు చాలా వెనుకబడి ఉన్నారు.

నార్త్ లో ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ సౌత్ లో రెండు, మూడు సినిమాలు చేసినా రాదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం బాలీవుడ్ ను శాసిస్తున్న హీరోయిన్లలో అలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, కృతి సనన్ టాప్ లో ఉంటారు.

వీరిలో కొంత మంది హాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకెళ్తున్నారు.అయితే ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వీరు తొలి సినిమాలకు గాను తీసుకున్న పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇంతకీ ఏ హీరోయిన్ తొలి సినిమా ఎన్ని డబ్బులు తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా

Telugu Alia Bhatt, Bollywood, Kangana Ranaut, Priyanka Chopra, Sonakshi Sinha-Te

ఈ బ్లాక్ బ్యూటీ తొలి సినిమా సంపాదన రూ.58 వేలు. ఈ డబ్బును తన తల్లికి ఇచ్చింది.అప్పట్లో ఈ మొత్తం పెద్ద మొత్తమే అని చెప్పుకోవచ్చు.

దీపికా పదుకొణె

Telugu Alia Bhatt, Bollywood, Kangana Ranaut, Priyanka Chopra, Sonakshi Sinha-Te

ప్రియాంకా చోప్రా తర్వాత హాలీవుడ్ అవకాశం దక్కించుకుంది దీపికా పదుకొణె.ఈమె కూడా దాదాపు ప్రియాంక మాదిరిగానే తొలి సినిమాకు పారితోషికం తీసుకుంది.

కంగనా రనౌత్

Telugu Alia Bhatt, Bollywood, Kangana Ranaut, Priyanka Chopra, Sonakshi Sinha-Te

కంగనా తన తొలి సినిమాకు గాను రూ.50 వేలు తీసుకుందట.తాను సంపాదించుకున్న మొత్తం కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు పెట్టింది.

ఆలియాభట్

Telugu Alia Bhatt, Bollywood, Kangana Ranaut, Priyanka Chopra, Sonakshi Sinha-Te

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.మొదటి సంపాదనను తన అవసరాలకే వాడుకుందట.ఎంత తీసుకుంది అనేది ప్రత్యేకంగా తెలియదు.

సోనాక్షి సిన్హా

Telugu Alia Bhatt, Bollywood, Kangana Ranaut, Priyanka Chopra, Sonakshi Sinha-Te

తొలి సినిమాలోనే సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టిన ఈ బొద్దుగుమ్మ.ఈ సినిమాకు గాను రూ.25 లక్షల పారితోషికం తీసుకుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube