అలియా వెర్సస్ జాన్వీ కపూర్… బాలీవుడ్ లో ఆసక్తికరమైన పోటీ  

Bollywood Alia Bhatt Jhanvi Kapoor -

బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురు అనే ఇమేజ్ తో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అలియా భట్.మిల్క్ బేబీలా ఉండే ఈ అమ్మడుకి బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి నిర్మాత అండ ఉండటంతో ఈ భామకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

 Bollywood Alia Bhatt Jhanvi Kapoor

ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.వాటిలో తెలుగు పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి కావడం విశేషం.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మరో సెలబ్రిటీ కుటుంబం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.

అలియా వెర్సస్ జాన్వీ కపూర్… బాలీవుడ్ లో ఆసక్తికరమైన పోటీ-Movie-Telugu Tollywood Photo Image

ఈ అమ్మడు మొదటి సినిమా ధడక్ తోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి శ్రీదేవి వారసురాలిగా నటనతో కూడా తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.

ఇక ఈమెకి కూడా కరణ్ జోహార్ సపోర్ట్ ఉంది.అలాగే బాలీవుడ్ లో బడా నిర్మాత బోణీ కపూర్ కూతురు కావడం జాన్వీకి మరో అసెట్.ఈ నేపధ్యంలో ఈ భామ కూడా ఓ బయోపిక్ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర లాంటి భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తుంది.ఇక బాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ హీరోయిన్స్ గా అలియా భట్, జాన్వీ కపూర్ మధ్య ఇప్పుడు ఆసక్తికర పోటీ నెలకొని ఉంది.

బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తమ సినిమాలలో హీరోయిన్ గా వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాలని భావిస్తున్నారు.ఇంతకాలం బాలీవుడ్ లో హవా కొనసాగించిన ప్రియాంకా, దీపికా పదుకునే హాలీవుడ్ స్టాండర్డ్ స్టార్స్ అయిపోవడంతో పాటు కంగనా ప్రత్యేక జోనర్ లోకి వెళ్ళిపోయింది.

ఈ నేపధ్యంలో ఇప్పుడు బీటౌన్ లో ఎట్రాక్షన్ లో జాన్వీ కపూర్, అలియా కనిపిస్తున్నారు.లాక్ డౌన్ తర్వాత బాలీవుడ్ ని ఎలాబోయే హీరోయిన్స్ వీళ్ళిద్దరే అనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు