తల్లితో మాట్లాడిన విషయాలను బయటపెట్టిన నటి స్వరా భాస్కర్!

Bollywood Actress Swara Reveals Hilarious Chat With Her Mom And Says Stop Cursing Your Own Child

దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి కోరలు చాస్తోంది.రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవడమే కాకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

 Bollywood Actress Swara Reveals Hilarious Chat With Her Mom And Says Stop Cursing Your Own Child-TeluguStop.com

దీంతో ప్రజలు మరొకసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.అయితే కరోనా ఇలాగే మరొకసారి విజృంభిస్తుండడంతో ఈసారి కూడా కరోనా ధాటికి ప్రజలు బలి అవ్వడమే కాకుండా, లాక్ డౌన్ ను విధించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అలా కరోనా బారిన పడిన వారిలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కూడా ఒకరు.

 Bollywood Actress Swara Reveals Hilarious Chat With Her Mom And Says Stop Cursing Your Own Child-తల్లితో మాట్లాడిన విషయాలను బయటపెట్టిన నటి స్వరా భాస్కర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వరా భాస్కర్ కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం స్వరా భాస్కర్ ఢిల్లీలోని తన ఇంట్లో క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటోంది.

ఇక తాజాగా స్వరా భాస్కర్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలిపింది.ఈ క్రమంలోనే తన తల్లితో కలిసి చేసిన వాట్సాప్ చాటింగ్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇక ఆ చాటింగ్ లో అమ్మను చిరాకు పెట్టడం నా జీవితంలో నేను చేసిన గొప్ప పనుల్లో ఒకటి అని స్వరా భాస్కర్ రాసుకొచ్చింది.ఆ విషయంపై స్వరా భాస్కర్ తల్లి కౌంటర్ వేస్తూ నువ్వు ఏది చేస్తే అదే నీ వెంట పడుతుంది గుర్తుపెట్టుకో అంటూ కౌంటర్ వేసింది.

Telugu Bollywood, Corona Viras, Quarantine, Swara Bhaskar, Swarabhaskar, Whats App Chat, Whatsapp-Movie

అప్పడు వెంటనే స్వరా భాస్కర్ అమ్మ నీ సొంత బిడ్డను తిట్టడం ఆపండి అంటూ రాసుకొచ్చింది.అంతేకాకుండా దానికి.నన్ను క్షమించు దేవుడా.కరోనా క్వారంటైన్ కారణంగా చాలా బోర్ ఫిల్ అవుతున్నా.అందుకే నా ఫ్యామిలీ చాట్‌ని బయటపెడుతున్నాను అని స్వరా భాస్కర్ రాసుకొచ్చింది.కొన్ని రోజుల క్రితం తనకు కరోనా సోకిన విషయాన్ని చెబుతూ.

కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాను అని స్వరా భాస్కర్ చెప్పుకొచ్చింది.

అలాగే అందరూ సరైన నిబంధనలు పాటించండి.జాగ్రత్తగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది.

#SwaraBhaskar #Swara Bhaskar #SwaraBhaskar #Quarantine #Corona Viras

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube