నేను నగ్నంగా సినిమాల్లో నటించినా నా భర్త పెద్దగా పట్టించుకోడు...

తెలుగులో 2009వ సంవత్సరంలో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు యంగ్ హీరో శర్వానంద్ తదితరులు హీరోగా నటించిన “రాజు మహారాజు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ముంబై బ్యూటీ “సుర్వీన్ చావ్లా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో తెలుగులో కంటే హిందీ, పంజాబీ, తదితర భాషలలో ఎక్కువగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.

 Bollywood Actress Surveen Chawla About Her Bold Scenes In Movies, Surveen Chawla-TeluguStop.com

దీంతో సుర్వీన్ చావ్లా తెలుగు సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.కాగా తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ వార్తా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సుర్వీన్ చావ్లా పాల్గొని తన వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా పెళ్లయిన తర్వాత నటనకి స్వస్తి చెప్పాలని తాను అనుకోవడం లేదని అందువల్లనే తాను ఇప్పటివరకు ఇలాంటి ఆఫర్ వచ్చిన కాదనకుండా నటిస్తున్నానని తెలిపింది.అంతేకాకుండా తనకి నటన వృత్తి పట్ల చాలా అంకిత భావం, గౌరవం ఉందని కాబట్టి తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నట్టు అవకాశం వస్తే బోల్డ్ షో మరియు స్కిన్ షో చేయడానికి కూడా వెనుకాడనని తెలిపింది.

ఇక తన భర్త విషయంపై స్పందిస్తూ తన భర్త అక్షయ్ థాక్రే తన వృత్తిని ఎంతగానో గౌరవిస్తాడని అందువల్లనే తమ మధ్య ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు రాలేదని చెప్పు వచ్చింది.ఒకవేళ తాను పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించినప్పటికీ తన భర్త మాత్రం ఏమీ అనుకోడని అర్థం చేసుకుంటారని తమ మధ్య అంతటి గాఢమైన ప్రేమ మరియు అర్థం చేసుకునేటువంటి గుణాలు ఉన్నాయని తెలిపింది.

Telugu Raju Maharaju, Surveen Chawla, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సుర్వీన్ చావ్లా హిందీలో అగ్లీ, హెట్ స్టోరీ 2, జైహింద్ 2, క్రియేచర్ త్రిడి, హిమ్మత్వాలా, వెల్కం బ్యాక్, తదితర హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ కథల పట్ల మరియు తన పాత్రల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో మరిన్ని హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలను కోల్పోయింది.కాగా సుర్వీన్ చావ్లా ఇటీవలే హిందీలో స్కేర్డ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube