ఈ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు హీరోతో ప్రేమలో పడిందట.. కానీ పెళ్లి మాత్రం...

సినిమా అనేది రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచం రోజు కొత్త ముఖాలు అలుముకుంటున్నాయి.

 Bollywood Actress Soha Ali Khan Love Affair With Telugu Hero-TeluguStop.com

అయితే ఇందులో నటి అవ్వాలని కోరికతో సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు.అలాగే ఒకట్రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత నటన తప్ప ఇతర అంశాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

అయితే బాలీవుడ్లో ఒకప్పుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, తదితర స్టార్ హీరోలతో నటించి తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు పిచ్చెక్కించిన ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Bollywood Actress Soha Ali Khan Love Affair With Telugu Hero-ఈ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు హీరోతో ప్రేమలో పడిందట.. కానీ పెళ్లి మాత్రం… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మామూలుగా సినీ సెలబ్రిటీలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అవకాశాల కోసం వెళుతుంటారు.

ఈ క్రమంలో కొంతమంది అక్కడే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.కానీ ఇందుకు భిన్నంగా సోహా అలీ ఖాన్ మాత్రం అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో తో ప్రేమాయణం నడిపిందట.

అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ హీరోతో కలిసి ఈ అమ్మడు ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మధ్యలో కొంతకాలం పాటు వీరిద్దరూ డేటింగ్ కూడా చేశారని, దీంతో తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పలు వార్తలు బలంగా వినిపించాయి.

Telugu Bollywood Actress, Bollywood Actress Soha Ali Khan Love Affair With Telugu Hero, Soha Ali Khan, Soha Ali Khan Love Afire, Tollywood-Movie

కానీ ఏమైందో ఏమోగాని ఆ టాలీవుడ్ హీరో చివరికి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయట.దీంతో సోహా అలీ ఖాన్ చేసేదేమీలేక బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ని పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది.

అయితే సోహా అలీ ఖాన్ మాజీ ప్రియుడు మాత్రం తన భార్య కి విడాకులు ఇచ్చాడట.దీంతో ఆ టాలీవుడ్ హీరో ఎవరో అంటూ కొంతమంది సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లో తెగ వెతుకుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత కూడా సోహా అలీఖాన్ అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.కాగా ఆ మధ్య ఈ అమ్మడు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన గ్యాంగ్ స్టర్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

దీంతో ప్రస్తుతం సోహా అలీ ఖాన్ పలు వెబ్ సిరీస్ లలో నటించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

#Soha Ali Khan #SohaAli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు