అవును రోహిత్ శర్మ తో డేటింగ్ కి వెళ్లా....అయితే ఎంటీ...

బాలీవుడ్లో పలు ధారావాహికలు మరియు చిత్రాల్లో నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన బాలీవుడ్ ప్రముఖ నటి మరియు సోఫియా హయత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమలో ఎక్కువగా తను నటించిన చిత్రాలతోకంటే ప్రేమాయణాలు మరియు వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది.

 Bollywood Actress Sofia Hayat About Her Dating With Rohit Sharma-TeluguStop.com

ఆ మధ్య సోఫియా హయత్ పలువురి భారత క్రికెటర్లతో ప్రేమాయణం నడుపుతుందని సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ అమ్మడు గురించి పలు వార్తలు బలంగా వినిపించాయి.

దీంతో సోఫియా హయత్ కూడా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం గురించి స్పందిస్తూ తాను భారత క్రికెట్ ఓపెనర్ రోహిత్ శర్మ తో డేటింగ్ కి వెళ్లినట్లు ట్వీట్ చేసింది.

 Bollywood Actress Sofia Hayat About Her Dating With Rohit Sharma-అవును రోహిత్ శర్మ తో డేటింగ్ కి వెళ్లా….అయితే ఎంటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అంతేకాక మరోమారు రోహిత్ శర్మతో కలిసి డేటింగ్ కి వెళ్ళనని, ఈ సారి మరో జెంటిల్ మెన్ తో వెళతానని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక మరోసారి  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ కి వెళ్తానని కూడా తెలిపింది.

దీంతో ఒక్కసారిగా సోఫియా హయత్ సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.అంతేగాక ఈ మధ్య కాలంలో సోఫియా హయత్ పాపులర్ కావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అందులో వాస్తవం లేదని కొందరు రోహిత్ శర్మ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అలాగే రోహిత్ శర్మ కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై ఏమాత్రం స్పందించ లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్దికాలంగా ఓ సోఫియా హయత్ సినిమా అవకాశాలు లేక ఖాళీగా గడుపుతోంది.

 దీంతో ప్రముఖ ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందాలను ఆరబోస్తుంది.  అయినా ఈ అమ్మడిని సినిమా అవకాశాలు వరించడం లేదు.  అయితే బాలీవుడ్ లో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షోలో 7వ సీజన్ లో కాంటెస్ట్ గ పాల్గొని తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

#Sofia Hayat #SofiaHayat #Rohit Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు