ఈ బ్యూటీ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా షూటింగ్ లో పాల్గొందట...

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరో అజయ్ దేవగన్ భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు అభిషేక్ దుడియా దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

 Bollywood Actress Nora Fatehi Injured In Bhuj Movie Shooting-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరత్ కేల్కర్, అమ్మి విరిక్, ఇబ్హాన్ దిల్లన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు కాగా తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన నోరా ఫతేహి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన విషయాలగురించి ప్రేక్షకులతో పంచుకుంది.

కాగా తాను ఈ చిత్రంలో నటించినందుకు చాలా గర్వ పడుతున్నానని తెలిపింది.అంతే కాకుండా ఈ చిత్రంలో తన పాత్ర చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది.

 Bollywood Actress Nora Fatehi Injured In Bhuj Movie Shooting-ఈ బ్యూటీ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా షూటింగ్ లో పాల్గొందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే తాను కూడా తన పాత్ర కోసం ప్రాణం పెట్టీ నటించానని చెప్పుకొచ్చింది.కాగా ఈ చిత్రంలోని తన పాత్రకి సంబంధించిన ఓ సన్నివేశం షూటింగ్ జరుగుతుండగా తన తలకి గాయం అయిందని దీంతో రక్తం వస్తున్నప్పటికీ ఏ మాత్రం భయ పడకుండా నటించానని చెప్పుకొచ్చింది.

దాంతో ఆ సన్నివేశం చాలా బాగా పండిందని కచ్చితంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆశా భావం వ్యక్తం చేసింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ కష్టపడే వారికి ఎప్పటికీ మంచి ఫలితాలు అందుకుంటారని అందులో ఎలాంటి సందేహం లేదని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Ajay Devgan, Bhuj Movie, Bollywood Actress, Bollywood Actress Nora Fatehi Injured In Bhuj Movie Shooting, Nora Fatehi, Nora Fatehi Injured News-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తవడంతో ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్ ని విడుదల చేశారు.దీంతో మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 13వ తారీఖున ప్రముఖ ఓటిటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.కాగా ప్రస్తుతం నోరా ఫతేహి పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బాగానే రాణిస్తోంది.

#NoraFatehi #Ajay Devgan #Nora Fatehi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు