ఆటో డ్రైవర్ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ హాట్ డ్యాన్స్?

మామూలుగా సినిమాలు థియేటర్ లో విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమా బడ్జెట్ ను బట్టి పలువురు దర్శక నిర్మాతలు ఆ సినిమా ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొందరు దర్శక నిర్మాతలు గ్రాండ్ గా ప్రమోషన్స్ ను నిర్వహిస్తే, ఇంకొందరు సింపుల్ గా  ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు.

 Bollywood Actress Nia Sharma Dances With Rickshaw Drivers On Her Song Phoonk Le-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ డేటా తగ్గి అందరికీ అందుబాటులోకి రావడంతో, ఓటీటీ లు, యూట్యూబ్ లతో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు.

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు కాకుండా డిజిటల్ గా విడుదల అయ్యే షోలు, సాంగ్స్ కి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ నియా శర్మ నటించిన ఒక సాంగ్ యూట్యూబ్ లో విడుదల అయింది.

అయితే ఈ పాట విడుదల అయ్యి రెండు రోజులు కూడా కాకముందే 4 మిలియన్ లకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్షల్లో లైక్స్ కూడా వచ్చాయి.

ఈ క్రమంలోనే దీని ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కి వెళ్ళింది ఈ బ్యూటీ.

ఇక తాజాగా ముంబై లోనే ఆటోరిక్షా డ్రైవర్ తో కలిసి తాను చేసిన సాంగ్స్ కి డాన్స్ వేసింది.నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ తో కలిసి పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే ఆ పాటకు స్టెప్పులు ఇరగ దీసింది.ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.

అందరూ ఆ వీడియో పాజిటివ్ గా స్పందించగా, ఇంకొందరు మాత్రం ఆ వీడియో పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు.కొందరు కామెడీగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube