విరాటపర్వంలో ఆ బాలీవుడ్ భామ! షూటింగ్ లో ఫోటోలు షేర్

రానా, సాయిపల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.సాయి పల్లవి ఇప్పటి వరకు చేయని విధంగా ఇందులో నక్సలైట్ పాత్రలో కనిపిస్తుంది.

 Bollywood Actress Nanditha Das Paly Key Role In Virataparvam-TeluguStop.com

ఇక రానా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.ఫారెస్ట్ నేపధంలో నక్షల్స్, గిరిజన జీవన స్థితి గతులని ఇందులో దర్శకుడు వేణు ఆవిష్కరించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి నందితా దాస్ ని దర్శకుడు ఎంపిక చేశాడు.అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతున్నా షూటింగ్ లో తాజాగా ఆమె భాగమయ్యారు.

దీనికి సంబందించిన ఫోటోలు నందితా దాస్ తన షేర్ చేశారు.బాలీవుడ్ లో నందితా దాస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆమె చాలా తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది.ఎక్కువగా రియాలిటీకి దగ్గరగా ఉండే కథలతోనే ఆమె నటించే సినిమాలు ఉంటాయి.

అలాంటి సినిమాలతో ఆమె జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.కమర్షియల్ కథలతో తెరకెక్కే సినిమాలకి ఆమె దూరంగా ఉంటుంది.

అలాంటి నటి కెరియర్ లో చేస్తున్న మొట్టమొదటి తెలుగు చిత్రం విరాటపర్వం.మరి సరికొత్త జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందితా దాస్ లాంటి నటి చేస్తుంది అంటే సినిమా ఎలా ఉండబోతుంది ఒక అంచనాకు రావచ్చు.

నీది నాది ఒకటే కథ సినిమాతో కార్పోరేట్ చదువుల మీద సెటైర్స్ వేసిన వేణు ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ టచ్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube