పాపం.... ఈ హీరోయిన్ బట్టలు మార్చుకుంటుంటే ఆ నిర్మాత వచ్చి...  

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై బయటకు వచ్చి బాగానే స్పందిస్తున్నారు.అయితే ఇందులో తాజాగా బాలీవుడ్ ప్రముఖ మోడల్ మరియు హీరోయిన్ “మందాన కరిమి” తాను ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఎదుర్కున్న సంఘటనల గురించి ఇటీవలే ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - Bollywood Actress Mandana Karimi Facing Abuse Incidents From Movie Producer

అయితే గతంలో తాను “కోకా కోలా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించానని చెప్పుకొచ్చింది. ఈ చిత్ర షూటింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఓ రోజున షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో తాను ఇంటికి వెళ్లేందుకు తయారవుతున్నానని సరిగ్గా అదే సమయంలో ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న నిర్మాత తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఆ నిర్మాత వచ్చినప్పుడు తాను క్యారవ్యాన్ లో బట్టలు మార్చుకుంటున్నానని దాంతో కొంత సమయం తర్వాత తర్వాత తానే బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పినప్పటికీ ఆ నిర్మాత వినకుండా తనని మానసికంగా వేధించాడని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

TeluguStop.com - పాపం…. ఈ హీరోయిన్ బట్టలు మార్చుకుంటుంటే ఆ నిర్మాత వచ్చి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ చిత్రాలకి దర్శక,నిర్మాతలు ఎంత ముఖ్యమో సినిమా ఆర్టిస్టులు కూడా అంతే ముఖ్యమని అలాంటి వారిపై ఇలాంటి మానసిక వేధింపులకు పాల్పడడం సరికాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక ఆర్టిస్ట్ అన్న తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ ఉంటారని కాబట్టి చిత్రం షూటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఇంకో చోటికి వెళ్ళి పోతూ ఉంటారని, అలాంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం కూడా సమంజసం కాదని కొందరు సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా  మందాన కరిమి బాలీవుడ్లో నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ ఈ చిత్రాలు ఈ  అమ్మడికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.కాగా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షోలో 9వ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని రెండో విజేతగా నిలిచింది.

కాగా ప్రస్తుతం “ది కాసినో” అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ దర్శకుడు హార్దిక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

#MandanaKarimi #Mandana Karimi #MandanaKarimi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు