విప్పి చూపిస్తేనే ఆఫర్స్ వస్తాయంటున్న ప్రముఖ మోడల్...

సినిమా పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ సమస్య కామన్ గానే ఉంటుంది.తాజాగా బాలీవుడ్ నటి అయినటువంటి మల్హార్  రాథోడ్ క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై పెదవి విప్పారు.

 Bollywood Actress Malhaar Rathod Sensational Comments-TeluguStop.com

ఇందులో భాగంగా తాను  8 సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు.అప్పట్లో తన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో  ఓ నిర్మాత నుంచి ఫోన్ వచ్చిందని తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ నిర్మాత నీకు తప్పకుండా అవకాశం ఇస్తానని కాకపోతే తను చెప్పిన విధంగా నడుచుకోవాలని అన్నట్లు తెలిపారు.

 అంతేగాక తనకు అవకాశం ఇవ్వాలని అంటే తన షర్టు విప్పేసి తన బాడీ మొత్తం చూపించాలని షరతు పెట్టాడని అన్నారు.

దీంతో ఆ సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాక అక్కడినుంచి వెళ్లి పోయానని కూడా అన్నారు.

అయితే ఆ నిర్మాత వయస్సు సుమారు 65 సంవత్సరాలు ఉంటుందని అన్నారు.తన కూతురు వయసున్న తనతో అని నిర్మాత అలా ప్రవర్తించడంతో కొంతకాలం సినిమాల గురించి ఆలోచించడం మానేసి మానసికంగా కృంగి పోయారని చెప్పుకొచ్చారు.

Telugu Malhaar Rathod, Malhaarrathod-Movie

అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెరలో వచ్చేటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో నటిస్తోంది.తాజాగా ఈమె ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఈ విషయాలని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొత్తగా పెట్టే వారికి అవకాశాలు అంత సులువుగా రావని కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా దర్శక నిర్మాతలు వారిని తన పడక గదిలోకి రమ్మంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube